శోభిత స్పెషల్ పోస్ట్.. అలా అనేసుకుందేంటి?
నటి, అక్కినేని కోడలు, హీరో నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. రీసెంట్ గా అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది.
By: M Prashanth | 3 Oct 2025 5:00 PM ISTనటి, అక్కినేని కోడలు, హీరో నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. రీసెంట్ గా అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అప్పటి నుంచి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శోభిత.. సోషల్ మీడియాలో ఎప్పటిలానే యాక్టివ్ గా ఉంది.
తరచూ కొత్త కొత్త పోస్టులు పెట్టే శోభిత ధూళిపాళ్ల.. ఇప్పుడు క్రేజీ క్యాప్షన్ తో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించిందనే చెప్పాలి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పలు ఫొటోలు పోస్ట్ చేయగా, అందులో వ్యాయామం చేస్తున్న పిక్, నెయిల్స్ ఫోటో, రెస్టారెంట్ లో స్టిల్ ఉన్నాయి. ఆమె తీసుకున్న సెల్ఫీలు కూడా పోస్ట్ లో ఎక్కువ ఉండడం విశేషం.
అయితే ఆ సెల్ఫీల కోసమే క్యాప్షన్ ఇచ్చిన అమ్మడు.. తాను సెల్ఫీ తీసుకునేటప్పుడు కెమెరాలో కాకుండా స్క్రీన్‌పై తను తాను చూసుకుంటానని చెప్పొకొచ్చింది. అంతే కాదు.. ఫన్నీగా ఇండియన్ అంకుల్ ను పిలుచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ క్యాప్షన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక శోభిత కెరీర్ విషయానికొస్తే.. రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. హిందీ చిత్రాల్లో మొదట్లో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా చేసిన గూఢచారి సినిమాతో తెలుగు డెబ్యూ ఇచ్చి మంచి హిట్ కూడా అందుకుందని చెప్పాలి. మేజర్ లో కీలక పాత్ర ఆమెకు దక్కింది.
కొన్ని రోజుల క్రితం మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బ్యూటీ.. ఆ తర్వాత ది నైట్ మేనేజర్ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీసుల్లో నటించింది. కానీ కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో నాగ చైతన్యతో వివాహం తర్వాత యాక్టింగ్ కు దూరమయ్యారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి.
కానీ రీసెంట్ గా విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన తమిళ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అందులో హీరోగా దినేష్ నటిస్తుండగా, మరో ప్రముఖ నటుడు ఆర్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తద్వారా పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ ను కొనసాగించాలనే ఉద్దేశంలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
