Begin typing your search above and press return to search.

పా రంజిత్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో శోభిత సాహ‌సాలు చూసారా?

టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాళ్ల పుట్టినరోజు సందర్భంగా తమిళ చిత్రం `వెట్టువం` నుండి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

By:  Sivaji Kontham   |   1 Jun 2026 9:44 AM IST
పా రంజిత్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో శోభిత సాహ‌సాలు చూసారా?
X

టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాళ్ల పుట్టినరోజు సందర్భంగా తమిళ చిత్రం `వెట్టువం` నుండి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బర్త్‌డే పోస్టర్‌ను షేర్ చేస్తూ.. శోభితకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు సినిమాలో త‌న‌ పాత్ర ఎంతో సాహసోపేతంగా.. సరికొత్త పరిణామాలతో సాగబోతోందని చిత్రబృందం హింట్ ఇచ్చింది. `పొన్నియిన్ సెల్వన్ 2` తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం శోభితా మళ్లీ నటిస్తున్న తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.





ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో శోభితా ధూళిపాళ్ల పూర్తిగా బ్లాక్ డ్రెస్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. బ్లాక్ ట్యాంక్ టాప్.. దానికి మ్యాచింగ్ టాప్.. బ్యాగీ ట్రౌజర్స్ ధరించి.. ఇక ఇటుక గోడ‌పై నిలబడి ఉన్న ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. దట్టమైన మేఘాలతో కూడిన ఆకాశం నేపథ్యంగా ఉన్న ఈ పోస్టర్‌లో శోభితా ముఖంలో కనిపించే గాంభీర్యం త‌న‌ పాత్ర లోని డెప్త్ ను.. నిగూఢ‌మైన సాహ‌సాల‌ ర‌హ‌స్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ``ఎన‌ర్జీ.. లాలిత్యం కలబోసిన అరుదైన వ్యక్తిత్వానికి జన్మదిన శుభాకాంక్షలు.. మునుముందు మరిన్ని సాహసాలను మీనుంచి కోరుకుంటున్నాం`` అంటూ పా రంజిత్ టీమ్ హృదయపూర్వక సందేశాన్ని షేర్ చేసింది.

ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై శోభితా అభిమానులు, నెటిజన్లు ఎంతో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. పోస్టర్ విజువల్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా - మిస్టీరియ‌స్ గా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తుఫానుకు ముందు ఉండే నిజమైన ప్రశాంతత ఇది... ఈ లుక్ ఒకేసారి పవర్, మిస్టరీ, ఎలిగెన్స్‌ను ప్రతిబింబిస్తోంది... ఈసారి ఫుల్-ఆన్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఉండబోతోంది! అంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రేక్షకులలో రేకెత్తుతున్న ఈ ఉత్కంఠ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శోభితా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఇది అత్యుత్తమమైన, అసాధారణమైన ప్రాజెక్ట్ అని కొనియాడారు. ఇందులో తాను మునుపెన్నడూ చూడని ఒక క్రేజీ అవతారంలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. విభిన్న కాలాల నేపథ్యంలో సాగే ఒక అపోకలిప్టిక్ (ప్రళయ కాల) కథాంశంతో, హై-డ్రామా- హై-అడ్రినలిన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందని శోభిత‌ పేర్కొంది.

ఈ చిత్రంలో వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శోభితాతో పాటు ఆర్య, కలైయరసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లారక్కల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పా రంజిత్ మార్క్ సామాజిక కోణానికి ఈసారి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడు కానుండడంతో ఈ సినిమా ఎలాంటి కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రిస్తుందో చూడాలి.