శోభిత మేడం గుడ్ న్యూస్ చెప్పేది ఎప్పుడో?
నాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఆ మధ్య శోభిత సినిమాలకు బ్రేక్ తీసుకుందని, ఆమె గర్భం దాల్చడం వల్లే సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు జోరుగా వినిపించాయి.
By: Ramesh Palla | 3 July 2026 12:00 AM ISTనాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఆ మధ్య శోభిత సినిమాలకు బ్రేక్ తీసుకుందని, ఆమె గర్భం దాల్చడం వల్లే సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు జోరుగా వినిపించాయి. ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని ఆమె టీం మెంబర్స్ కొందరు కొట్టి పారేశారు. నాగార్జున సైతం సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తాము, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో శోభిత ప్రెగ్నెంట్ అనే వార్తలకు బ్రేక్ వేసినట్లు అయ్యింది. నాగార్జున వ్యాఖ్యల తర్వాత మీడియాలో శోభిత గర్భం విషయమై చర్చ ఆగి పోయింది. అయితే ఇటీవల సమంత ప్రెగ్నెంట్ అనే విషయం అధికారికంగా బయటకు వచ్చినప్పటి నుంచి మళ్లీ శోభిత గర్భం విషయమై సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.
శోభిత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు..
సాధారణంగా పెళ్లి అయిన హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ వార్తలు రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. ఏ హీరోయిన్ పెళ్లి అయినా ఏడాదికో రెండేళ్లకో ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యిందంటా అంటూ వార్తలు రావడం సహజం. చాలా మంది హీరోయిన్స్ ఆ వార్తలను కొట్టి పారేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సార్లు మాత్రం ఆ వార్తలు నిజమే అన్నట్లుగా హీరోయిన్స్ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య సమంత గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి. మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్ సమయంలో సమంత ప్రెగ్నెన్సీ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఆ వార్తలను నిజమే అన్నట్లుగా సమంత తాజాగా తన బేబీ బంప్ ఫోటోను షేర్ చేయడంతో పాటు, జీవితంలో చాలా సంతోషకరమైన సందర్భం అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ జూనియర్ కోసం వెయిట్ చేస్తున్నామని మెసేజ్‌లు చేస్తున్నారు.
నాగ చైతన్య, శోభిత జంటకు...
ఇదే సమయంలో నాగ చైతన్య, శోభితలు ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారా అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టి పారేశారు. ఇప్పుడు మరోసారి శోభిత ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నటిగా శోభిత బిజీగా ఉన్నప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ కోసం వారసుడిని ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు. చనిపోయిన అక్కినేని నాగేశ్వరరావు గారికి శోభిత జన్మనివ్వాలని సీనియర్ అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరో వైపు అఖిల్ వైపు కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ముందుగా నాగార్జునను తాత చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కొడుకులకు ఏమాత్రం తగ్గకుండా నాగార్జున వరుస సినిమాలు చేస్తూ, హ్యాండ్సమ్ లుక్‌తో అదరగొడుతున్నాడు. మనవడు వచ్చిన తర్వాత కూడా నాగ్ సిల్వర్ స్క్రీన్ ను దున్నేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అక్కినేని ఫ్యాన్స్ కోసం వృషకర్మ, లెనిన్ సినిమాలు..
శోభిత గత ఏడాది ఏ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొత్త సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా లేవు. అందుకే శోభిత ప్రెగ్నెంట్ అనే వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కొత్త సినిమాల విషయంలో శోభిత నిర్ణయం చేసుకుంటున్నట్లుగా అనిపించడం లేదు. అందుకే ఇప్పుడు కూడా శోభిత ప్రెగ్నెంట్ అయ్యి ఉంటుంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి వారికి శోభిత నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా అనేది చూడాలి. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ శుభవార్త శోభిత ఎప్పుడు చెబుతుందా అని అందరూ ఎదురు చూడాల్సిందే. నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ నటించిన లెనిన్ పై అంచనాలు పెంచుకుని ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో వృషకర్మ విడుదలై హిట్ కొట్టి, లెనిన్‌తో అఖిల్ హిట్ కొట్టి, అక్కినేని వారసుడు వస్తే ఫ్యాన్స్‌కు అంతకు మించింది ఏం ఉంటుంది..!
