పాలిటిక్స్ పై శోభిత కామెంట్స్.. సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్!
ఈ నేపథ్యంలోనే గతంలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల పాలిటిక్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ నెట్టింట చర్చకు దారి తీసాయి. దీంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.
By: Madhu Reddy | 5 Aug 2026 12:54 PM ISTసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే హీరోయిన్లు వివాదాల జోలికి వెళ్లాలని అనుకోరు. ఒకవేళ వెళితే ఆ ప్రభావం తమ కెరియర్ పై పడుతుందేమో అనే భయం. మరి కొంతమంది పాలిటిక్స్ పై అసలుకే స్పందించరు. అయితే ఇక్కడ కొంతమంది అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల పాలిటిక్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ నెట్టింట చర్చకు దారి తీసాయి. దీంతో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.
కమ్యూనిజమే గెలుస్తుంది..
సినిమాలు, సిరీస్ లు, ర్యాంప్ వాక్ , ఇంస్టాగ్రామ్ అంటూ నిత్యం కాళీ లేకుండా బిజీగా గడిపేస్తున్న ఈమె.. గతంలో మాట్లాడిన మాటల తాలూకు వీడియోని కొంతమంది ఇప్పుడు మళ్లీ బయటకు తీస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ.." నాకు వామపక్ష భావాజాలం ఎక్కువ.. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే గెలుస్తుంది" అంటూ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
నెట్టింట భిన్నాభిప్రాయాలు:
శోభిత తన మనసులోని భావాలను ఎటువంటి భయం, బెదురు లేకుండా ధైర్యంగా చెప్పడంతో అందరూ ఈమె ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తుంటే.. మరి కొంత మంది ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినీ రంగంలో గ్లామర్ నటిగా దూసుకుపోతూ లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న శోభిత ఇలా కమ్యూనిజం స్వామ్యవాదం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె గతంలో అన్న మాటలను ఇప్పుడెందుకు బయటకు తీసి ట్రోల్స్ చేస్తున్నారు అంటూ మండిపడుతూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు కొంతమంది నెటిజన్స్.
శోభిత పై భారీ ట్రోల్స్..
వందల కోట్ల ఆస్తితో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న శోభిత ఇప్పుడేమో కమ్యూనిజమే గెలుస్తుంది అంటూ కామెంట్లు చేసింది కదా.. మరి తన సంపాదన డొనేట్ చేసి, లగ్జరీ లైఫ్ ని వదిలేసి కమ్యూనిస్టు ప్రిన్సిపుల్స్ ప్రకారం ఆమె ఎందుకు జీవించడం లేదు అంటూ కూడా మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా శోభిత అప్పుడెప్పుడో పాలిటిక్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. మరి తనపై వస్తున్న ట్రోల్స్ కి ఆమె ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
శోభిత చిత్రాలు..
ఒకప్పుడు హిందీ, హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభిత ధూళిపాల.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు, సీరిస్ లు అంటూ దూసుకుపోతోంది శోభిత ధూళిపాల. అందులో భాగంగానే చీకటిలో అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. క్రాస్ రోడ్స్ అనే మరో చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది ..అలాగే మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా మారింది శోభిత.
