Begin typing your search above and press return to search.

ముంతాజ్ ఐకానిక్ లుక్‌ను గుర్తు చేసిన శోభిత.. ఆరెంజ్ శారీలో ఫ్యాషన్ గోల్స్!

టాలీవుడ్ హాట్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గ్లోబల్ స్థాయిలో తనదైన స్టైల్‌తో మెప్పిస్తు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   17 Aug 2026 1:35 PM IST
ముంతాజ్ ఐకానిక్ లుక్‌ను గుర్తు చేసిన శోభిత.. ఆరెంజ్ శారీలో ఫ్యాషన్ గోల్స్!
X

టాలీవుడ్ హాట్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గ్లోబల్ స్థాయిలో తనదైన స్టైల్‌తో మెప్పిస్తు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. కాంతివంతమైన ఆరెంజ్ రంగు సారీలో వింటేజ్ వైబ్స్, మోడరన్ గ్లామర్ కలగలిపిన రూపంతో అందరినీ ఆకట్టుకున్నారు. బాలీవుడ్ ఐకానిక్ నటి ముంతాజ్ క్లాసిక్ శారీ లుక్‌ను రీక్రియేట్ చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త గోల్స్ ఇస్తున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..




ఆరెంజ్ ఛార్మింగ్‌తో కేక పెట్టిస్తున్న పిక్స్:

పచ్చని ప్రకృతి నేపథ్యం ముందు శోభితా ఆరెంజ్ రంగు బంధేజ్ పాటర్న్ చీరలో, దానికి తగినట్లుగా డిజైన్ చేసిన బ్యాక్‌లెస్ బ్లౌజ్‌లో మెరిసిపోయారు. ఇక సూర్యాస్తమయం వెలుగులో ఆమె కట్టిన చీర, ఎంబ్రాయిడరీ బోర్డర్ కాంతివంతంగా మెరుస్తూ రాయల్ లుక్‌ను ఇచ్చాయి. ఈ ఫొటోషూట్‌లో శోభితా నవ్వు, ఆమె ఒలికించిన సొగసు కుర్రకారును మైమరపిస్తున్నాయి.




ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వినూత్నమైన ఆ స్ఫూర్తి:

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ శోభితా రాసుకొచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తికరంగా మారింది. "ఆరెంజ్ ట్యాంగ్, పింట్రెస్ట్‌లో ముంతాజ్ చీర పిక్, సూర్యాస్తమయం, నిన్న రాత్రి ఫ్రిజ్‌లో దాచిన గాజర్ కా హల్వా, మరియు ససురాల్ గెందా పూల్ పాట.. వీటి నుంచే నాకు ఈ లుక్ స్ఫూర్తి లభించింది" అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇక ప్రతి అంశాన్ని తన శైలికి అనుగుణంగా మలచుకుని అద్భుతంగా మెరిశారు.




అనురాగ్ కాశ్యప్ సినిమా నుంచి హాలీవుడ్ వరకు:

అనురాగ్ కాశ్యప్ 'రామన్ రాఘవ్ 2.0'తో వెండితెరకు పరిచయమైన శోభితా, 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్ సిరీస్‌తో విశేష ప్రసిద్ధి చెందారు. తెలుగులో 'గూఢచారి', 'మేజర్', తమిళంలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్', హాలీవుడ్‌లో 'మంకీ మేన్' వంటి చిత్రాలతో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల ప్రైమ్ వీడియోలో వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' మూవీ లోనూ అలరించిన ఆమె ప్రస్తుతం పా రంజిత్ తమిళ ప్రాజెక్ట్ 'వెట్టువం'లో నటిస్తున్నారు.




బ్యూటీ పేజెంట్ విజేత నుంచి అంతర్జాతీయ నటిగా ఎదిగిన శోభితా, తెరపై నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో తన వైవిధ్యమైన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రతిసారీ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక ముంతాజ్ ఐకానిక్ లుక్‌కి తనదైన టచ్ ఇచ్చి చేసిన ఈ ఆరెంజ్ శారీ ఫొటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.