Begin typing your search above and press return to search.

వీడియో: రెప్ప వేయ‌నివ్వ‌ని శోభిత అక్కినేని అందం

ఈ సందర్భంగా 'వోగ్ ఇండియా'తో శోభిత మాట్లాడుతూ తన దుస్తుల వెనుక ఉన్న అంత‌రార్థాన్ని.. ప్రత్యేకతను వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   30 July 2026 9:45 AM IST
వీడియో: రెప్ప వేయ‌నివ్వ‌ని శోభిత అక్కినేని అందం
X

అక్కినేని కోడ‌లు అనే కంటే.. `అంత‌కుమించి` అని నిరూపిస్తున్నారు శోభిత ధూళిపాల‌. త‌న ఇండివిడ్యువాలిటీ, అసాధార‌ణ వ్య‌క్తిత్వం, గొప్ప జెన్ జి ఫ్యాష‌న్ సెన్స్ తో నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఫ్యాషన్ ప్ర‌పంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శోభిత అక్కినేని (ధూళిపాళ్ల) ప్రతిసారీ తనదైన శైలితో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. మోడలింగ్ నుంచి నటన వరకు తన ప్రత్యేకతను చాటుకున్న శోభిత నేటి జెన్-Z ఫ్యాషనిస్టాలకు ఒక ఆధునిక గురువు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఏ ఇతర క్రియేటర్ లేదా మోడల్‌కు తగ్గని రీతిలో అక్కినేని కోడ‌లు దుస్తుల ఎంపికలు నిరంతరం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంటాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన హ్యుందాయ్ ఇండియా కోచ‌ర్ వీక్ 2026 లో శోభిత మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌- గ్రాండియారిటీతో అందరి దృష్టినీ ఆకర్షించారు.

ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన డిజైన్ల ప్రదర్శనలో శోభిత అక్కినేని షో స్టాపర్‌గా నిలిచి.. ఈ ఈవెంట్‌కు అద్భుతమైన క‌ళాత్మ‌క‌త‌ను జోడించారు. గ‌త‌ రాత్రి న్యూఢిల్లీలో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో రాహుల్ మిశ్రా కొత్త‌ కలెక్షన్ `దేవి`కి సంబంధించిన ప్రత్యేక డిజైన‌ర్ దుస్తుల‌ను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ప్రాచీన భారతీయ వైభవాన్ని, నేటి ఆధునిక రంగానికి అనుసంధానిస్తూ శోభిత చేసిన ఈ ర్యాంప్ వాక్ చూసిన వారందరూ కంటిరెప్ప వేయడం మరచిపోయారంటే అతిశయోక్తి కాదు. భారతీయ సంస్కృతిలోని గాంభీర్యాన్ని.. ఆధునిక శైలిని మేళవించి శోభిత త‌న ఫ్యాష‌న్ సెన్స్ ను ఆవిష్కరించిన తీరు ఫ్యాషన్ ప్రియులను అమితంగా మైమరపించింది.

ఈ సందర్భంగా `వోగ్ ఇండియా`తో శోభిత మాట్లాడుతూ తన దుస్తుల వెనుక ఉన్న అంత‌రార్థాన్ని.. ప్రత్యేకతను వెల్లడించారు. ప్రాచీన భారతదేశం.. ప్రత్యేకించి ఒకానొక ప్రాంతంలోని దేవాలయాలు.. అక్కడి అద్భుతమైన శిల్పకళ నుంచి స్ఫూర్తి పొంది ఈ దుస్తులను రూపొందించార‌ని శోభిత తెలిపారు. ``ఇవి పక్కాగా `దేవి` కోడెడ్ దుస్తులు`` అని వివరించారు. భారతదేశం ప్రాచీన సంస్కృతి- ఆధ్యాత్మిక మూలాలను ఫ్యాషన్ వేదికపైకి తీసుకురావడం..దానికి శోభిత ప్రాణం పోయడం ఈ షోకేస్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

దుస్తుల తయారీలో వాడిన ప్రత్యేకతను విశ్లేషిస్తూ శోభిత మరింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా నేసిన ఆ ఫ్యాబ్రిక్ (గుడ్డ) నిర్మాణం..నేత శైలి ఎంతో అద్భుతంగా.. ఊహకందని విధంగా ఉందని పేర్కొన్నారు. శిల్పకళలోని సూక్ష్మమైన డిజైన్లను ఫ్యాబ్రిక్‌పై చేతివృత్తుల ద్వారా ఆవిష్కరించడం రాహుల్ మిశ్రా కే సాధ్య‌మైన‌ కళ అని.. అది తనకు ఎంతో కంటిరెప్ప వేయనివ్వని అనుభూతిని ఇచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. భారతీయ చేనేత- శిల్పకళల మేళవింపుగా వచ్చిన ఆ వ‌స్త్రం ప్రపంచ స్థాయి కోచుర్ రంగానికి భారతీయ చేతివృత్తుల సత్తాను చాటిచెప్పింది.

మొత్తానికి శోభిత అక్కినేని కేవలం ఒక సినీ నటిగానే కాకుండా.. భారతీయ సంస్కృతిని ఆధునిక ఫ్యాషన్ ప్రమాణాలకు తగినట్లుగా ప్రపంచానికి చాటిచెప్పే గ్లోబల్ ఐకాన్‌గా ఎదుగుతున్నారు. ట్రెండ్స్‌ను కేవలం అనుసరించడమే కాకుండా.. కొత్త ట్రెండ్స్‌ను సృష్టించడంలో జెన్-జెడ్ తరానికి ఒక దిక్సూచిలా మారారు. `దేవి` కలెక్షన్ ద్వారా ప్రాచీన భారతీయ దేవాలయ కళలను.. శిల్పసౌందర్యాన్ని ర్యాంప్ పైకి తీసుకువచ్చి.. ఇండియా కోచుర్ వీక్ 2026లో శోభిత ఒక కొత్త మైల్ స్టోన్ అందుకున్నార‌ని చెప్పొచ్చు.