మ్యాగజైన్స్ అంటే అక్కినేని కోడలికి అంత ఇష్టమా?
ఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యాషన్ ఫొటోషూట్లు.. ఇలా తనకంటూ స్పెషల్ ఫేమ్ ను సొంతం చేసుకుంటున్నారు నటి శోభితా ధూళిపాళ.
By: M Prashanth | 12 Oct 2026 7:55 PM ISTఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫ్యాషన్ ఫొటోషూట్లు.. ఇలా తనకంటూ స్పెషల్ ఫేమ్ ను సొంతం చేసుకుంటున్నారు నటి శోభితా ధూళిపాళ. సిల్వర్ స్క్రీన్ పై నటిగా మెప్పిస్తున్న ఈమె.. మ్యాగజైన్ కవర్లపై కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పై మెరిశారు. దీంతో శోభితకు మ్యాగజైన్స్ అంటే ఎందుకంత ఇష్టమనే డిబేట్ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది.
యంగ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభిత గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమె సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు స్టైల్ అండ్ మూవీ మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోలు, ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.
అయితే శోభితకు ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు. కొత్త ఆలోచనలను చూపించడానికి అదొక మంచి వేగా ఆమె భావిస్తారు. అందుకే మ్యాగజైన్ ఫొటోషూట్లను స్పెషల్ గా చూస్తారు. ప్రతి ఫొటోలో కూడా ఏదో ఒక ఫ్రెష్ నెస్ ఉండాలని కోరుకుంటారు. డ్రెస్సింగ్, ఫొటోలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న ఆలోచనకు కూడా ఆమె ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే శోభిత ఫొటోషూట్లు తెగ చక్కర్లు కొడుతుంటాయి.
కొవిడ్ టైమ్ లో అందరూ ఇళ్లకే పరిమితమైనప్పుడు కూడా శోభిత తనదైన స్టైల్ లో ఫొటోషూట్ చేశారు. ఎవరి హెల్ప్ లేకుండా సెల్ఫ్ టైమర్ యూజ్ చేసి పిక్స్ ను తీసుకున్నారు. ఆ పిక్స్ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. అప్పటి నుంచి ఫ్యాషన్ వరల్డ్ లో కూడా ఆమె యూనిక్ క్రేజ్ తెచ్చుకున్నారు. గతంలో వోగ్ వెడ్డింగ్ బుక్ వంటి మ్యాగజైన్లలో కనిపించిన ఆమె.. ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పై మెరిశారు.
ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను కూడా శోభిత షేర్ చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో అందరూ ఫాలో అయ్యే పద్ధతులకు భిన్నంగా తనదైన స్టైల్ లో వెళ్లే సమయంలో ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయపడినట్లు చెప్పారు. అయినప్పటికీ తన ఆలోచనలను పక్కన పెట్టకుండా ముందుకు సాగారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. అలాగే మనుషులు ఎప్పటికప్పుడు మారడం కామన్ అని శోభిత అన్నారు.
చుట్టూ ఉండే పరిస్థితులు, ఎదురయ్యే ఎక్స్పీరియన్సులు మన ఆలోచనలను మార్చుతాయని చెప్పారు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదని అన్నారు. ఇక రామన్ రాఘవ్ 2.0 సినిమాతో నటిగా జర్నీని స్టార్ట్ చేసిన శోభిత ధూళిపాళ్ల.. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శోభిత.. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో కోలీవుడ్ మూవీ వెట్టువంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
