Begin typing your search above and press return to search.

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల మరోసారి తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జీక్యూ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్‌లో వైట్ డ్రెస్, బ్లాక్ నెట్ లేస్ అవుట్‌ఫిట్, గోల్డ్ చైన్స్‌తో కూడిన బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. మెస్సీ బన్ హెయిర్‌స్టైల్, క్లాసీ లుక్‌తో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించారు. మేడ్ ఇన్ హెవెన్, గూఢచారి, మేజర్, పొన్నియిన్ సెల్వన్, మంకీ మ్యాన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న వెట్టువం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Madhu Reddy   |   5 Nov 2026 5:46 PM IST
అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!
X

టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల మరోసారి తన గ్లామర్ మరియు స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ‘జీక్యూ’ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఆమె చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభిత ఫ్యాషన్ ప్రయాణానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

జీక్యూ కవర్ పేజీపై కిరాక్ లుక్స్:

తాజాగా జీక్యూ మ్యాగజైన్ కోసం శోభిత ఫ్యాషన్ విజువల్స్ కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైట్ డ్రెస్, బ్లాక్ నెట్ లేస్ సెట్, అలాగే బ్లాక్ కలర్ డ్రెస్‌పై గోల్డ్ చైన్స్ ధరించి ఆమె ఇచ్చిన పోజులు కేక పుట్టించేలా ఉన్నాయి. ప్రతి అవుట్‌ఫిట్‌కు తగినట్లుగా మెస్సీ బన్ హెయిర్‌స్టైల్, క్లాసీ అప్పియరెన్స్‌తో మెరిసిపోతూ ఫ్యాషన్ ప్రేమికులను ఫిదా చేస్తున్నారు.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు:

ఇక 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ కిరీటం గెలుచుకున్న శోభితకు మొదట్లో ఆడిషన్లలో ఎదురుదెబ్బలు తగిలాయి. "మోడల్ కాబట్టి సినిమాలకు పనికిరాదు", "మిస్ ఇండియా కాబట్టి ర్యాంప్‌కే పరిమితం" అంటూ చాలామంది రిజెక్ట్ చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా మూడేళ్ల పాటు వరుసగా ప్రయత్నించి చివరికి నటిగా నిలదొక్కుకున్నారు.

‘మేడ్ ఇన్ హెవెన్’తో తిరుగులేని క్రేజ్:

శోభిత కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పిన ప్రాజెక్ట్ ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్. అందులో తార ఖన్నా పాత్రలో ఆమె అద్భుతమైన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘గూఢచారి’, ‘మేజర్’, ‘పొన్నియిన్ సెల్వన్’, హాలీవుడ్ మూవీ ‘మంకీ మ్యాన్’ వంటి చిత్రాలతో గ్లోబల్ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లోనూ నటిగా మంచి ప్రశంసలు అందుకున్నారు.

తమిళంలో ‘వెట్టువం’తో గ్రాండ్ కంబ్యాక్:

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత శోభిత తమిళంలో ‘వెట్టువం’ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. చాలా కాలం తర్వాత థియేటర్లలోకి వస్తున్న పెద్ద సినిమా కావడంతో దీనిపై ఫాన్స్ అసలు పెట్టుకున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా సొంత కష్టంతో ఎదిగిన శోభిత ధూళిపాళ్ల తన అందంతో, టాలెంట్‌తో అటు సినిమా రంగంలోనూ, ఇటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ దూసుకుపోతున్నారు. ఇక ఈ లేటెస్ట్ జీక్యూ ఫోటోషూట్ ఆమె గ్లామర్‌ను మరో స్థాయికి తీసుకెళ్ళిందా అంటే అవును అనే చెప్పచ్చు.