Begin typing your search above and press return to search.

అక్కినేని పెద్ద కోడలు శోభిత.. రెండేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్ అంట!

అక్కినేని ఇంటి సరదా ముచ్చట్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.

By:  M Prashanth   |   25 July 2026 11:12 AM IST
అక్కినేని పెద్ద కోడలు శోభిత.. రెండేళ్లలో ఇదే ఫస్ట్ టైమ్ అంట!
X

అక్కినేని ఇంటి సరదా ముచ్చట్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. సాధారణంగా పర్సనల్ విషయాలను తక్కువగా పంచుకునే నాగచైతన్య.. ఈసారి తన భార్య శోభిత ధూళిపాళ గురించి పెట్టిన ఓ చిన్న పోస్ట్‌ తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. "పెళ్లయిన దాదాపు రెండేళ్ల తర్వాత నా వైఫ్ నా కోసం వంట చేసింది. ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాను" అంటూ చైతూ చేసిన ఫన్నీ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ పోస్ట్‌ తో అభిమానులు మాత్రమే కాదు, నెటిజన్లు కూడా ఆసక్తికర చర్చ మొదలుపెట్టారు. నిజంగానే శోభితకు వంట రాదా? లేక ఇది కపుల్ మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్ లో భాగమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. శోభిత కూడా దీనికి తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతూ.. "నన్ను ట్రోల్ చేస్తున్నావా? లేక పొగుడుతున్నావా?" అంటూ కామెంట్ చేయడం విశేషం.

చైతూ షేర్ చేసిన ఫొటోలో శోభిత రెండు ప్లేట్స్ లో భోజనం పట్టుకుని నవ్వుతో కనిపించింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఎంతో సాధారణంగా కనిపించిన ఆమెను చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ను ఆస్వాదిస్తారనే విషయాన్ని ఆ పోస్ట్ మరోసారి గుర్తు చేసింది.

అయితే ఆ ఫన్నీ పోస్ట్ వెనుక ఒక చిన్న బ్యాక్ గ్రౌండ్ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరిని "ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు?" అని అడిగినప్పుడు నాగచైతన్య సరదాగా స్పందించారు. "నేను ప్రతిరోజూ హాట్ చాక్లెట్ చేస్తాను. కానీ అది వంట కిందకు రాదు. శోభితకు ఇంకా ఆ ప్రైమరీ టాలెంట్ కూడా లేదు" అంటూ నవ్వుతూ చెప్పారు. అప్పట్లో ఆ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత శోభిత ఓ షూటింగ్ సమయంలో వంట చేస్తున్న ఫొటోలను పంచుకుంటూ చైతూకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. దీంతో "నీ చేతి వంట కోసం ఎదురుచూస్తున్నా" అని నాగచైతన్య కామెంట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు చూస్తే, అప్పట్లో చేసిన ఆ కామెంట్స్ కు ఇదే కంటిన్యూషన్ గా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ జంట తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, శోభిత.. తరచూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు లవ్ చూపించుకుంటా అభిమానులను అలరిస్తుంటారు. ఏదేమైనా శోభిత నిజంగా రెండేళ్ల తర్వాత మొదటిసారి వంట చేసిందా? లేక నాగచైతన్య తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేశారా? అన్నది పక్కన పెడితే.. ఆ పోస్ట్ మాత్రం అక్కినేని అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. సెలబ్రిటీల లైఫ్స్ లో కూడా ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మూమెంట్స్ అభిమానులను మరింత దగ్గర చేస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.