ఒక్క పోస్ట్.. వివాదాస్పద చిత్రంపై భారీ హైప్!
అయితే ఇప్పుడు మరొక నటి కూడా ఒక సినిమా గురించి స్పందించి.. ఆ సినిమాపై హైప్ పెంచేసింది.
By: Madhu Reddy | 11 Nov 2025 1:04 PM ISTకొన్ని సినిమాలు మామూలు ప్రేక్షకులను మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలను కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. సెలబ్రిటీలకు సినిమాలు విపరీతంగా నచ్చుతుంటాయి. అయితే చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రమే ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఆ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఏ సినిమా నచ్చిన కూడా దాని గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో మహేష్ బాబు చిన్న సినిమాలు గురించి కూడా పోస్టులు వేస్తుంటారు అయితే అవి చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఒక తరుణంలో మేము ఫేమస్ అనే సినిమా గురించి మహేష్ బాబు రాసినందుకు చాలామంది ట్రోలింగ్ చేశారు. ఆ ట్వీట్ మహేష్ బాబు చేయలేదని.. ఎవరో ఆ ట్విట్టర్ అకౌంట్ ని హ్యాండిల్ చేసి చేశారని వాదనలు కూడా వినిపించాయి. కానీ ఆ తర్వాత మహేష్ బాబు ఆ ట్వీట్ చేశారని తెలిసి అందరూ ఆ సినిమా చూడడానికి ఆసక్తి కనబరిచారు.
అయితే ఇప్పుడు మరొక నటి కూడా ఒక సినిమా గురించి స్పందించి.. ఆ సినిమాపై హైప్ పెంచేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి అక్కినేని నాగచైతన్య భార్య శోభిత వివాదాస్పద సినిమాగా పేరు సాధించుకున్న బ్యాడ్ గర్ల్ చిత్రంపై పాజిటివ్ కామెంట్లు చేయడమే కాకుండా ఈ తరం యువతకు ఆమె పిలుపునిచ్చింది. దీంతో వివాదాస్పద గొడవల మధ్య కలెక్షన్లు లేక సతమతమవుతున్న చిత్రానికి శోభిత ఒక్క పోస్టుతో భారీ హైప్ ఇచ్చేసింది.
నటి శోభితా ధూళిపాళ ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సినిమా తనను నవ్వించి, కన్నీళ్లు పెట్టించిందని, మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగించిందని శోభిత ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ మరింత అద్భుతంగా ఉందని, ముఖ్యంగా అమ్మాయిలకు తాను ఈ సినిమా చూడమని సజెస్ట్ చేస్తున్నట్లు శోభిత తెలిపారు.
ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూసిన చాలామంది సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. దర్శకురాలు వర్ష భరత్ కు కొంతమంది విపరీతమైన ఎలివేషన్స్ ఇస్తున్నారు. నటి అంజలి శివరామన్ లకు పర్ఫామెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. శోభిత కూడా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. జియో హాట్ స్టార్ లో ఉన్న ఈ సినిమాను తప్పకుండా చూడాలి అని చెప్పారు. సినిమా చూడమని ప్రేక్షకులను ప్రోత్సహించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. రమ్య అనే గర్ల్ (Anjali Sivaraman) టేట్ హైస్కూల్ నుంచి అడల్ట్ లైఫ్ వరకు జరిగే లైఫ్ చూపిస్తారు. ఫ్యామిలీ, లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ వంటి అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో చూపించబడ్డాయి. ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
