4 రోజులు నిద్ర పోకూడదని చెప్పిన స్నేహ.. ఆఖరికి ఏమైందంటే?
తన కూతురు అర్హ 9వ బర్త్ డే సందర్భంగా అబుదాబికి వెళ్లిన స్నేహ అక్కడి నుంచి ఓ రీల్ ను పోస్ట్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 Dec 2025 9:00 PM ISTమెగా డాటర్ కొణిదెల నిహారిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఇన్‌స్టాలో కొన్ని రీల్స్ ను షేర్ చేస్తూ వాటితో టైమ్‌పాస్ చేస్తుంటారు. ఇప్పుడు మెగా కోడలు స్నేహా రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ మామూలుగా ఆన్‌లైన్ లో చాలా సింపుల్ గా ఉంటారు.
అర్హ బర్త్ డే కోసం అబుదాబికి వెళ్లిన స్నేహ
కానీ ఇప్పుడు స్నేహ కూడా తన రూటును మార్చినట్టు తెలుస్తోంది. తన కూతురు అర్హ 9వ బర్త్ డే సందర్భంగా అబుదాబికి వెళ్లిన స్నేహ అక్కడి నుంచి ఓ రీల్ ను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో స్నేహ చాలా యాక్టివ్ గా ఎవరూ ఊహించిన దానికంటే సరదాగా కనిపించారు. ఈ ట్రిప్ కు స్నేహ బాస్ లా వ్యవహరించడంతో పాటూ చాలా ఎనర్జీగా కనిపించారు.
నాలుగు రోజులు ఫోన్లు బ్యాన్
వీడియోలో స్నేహ చాలా యాక్టివ్ గా తన ఫ్రెండ్స్ తో ఈ నాలుగు రోజులు ఫోన్లు బ్యాన్ అని, ఎవరూ కనీసం నిద్ర పోవడం గురించి ఆలోచన కూడా చేయకూడదని, ఈ నాలుగు రోజుల్ని ఓ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. అయితే ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కు వెళ్లినప్పుడు ఇవన్నీ ముందు అనుకునేవే కానీ తర్వాత రియాలిటీ మాత్రం వేరుగా ఉంటుంది.
ఇక్కడ కూడా అదే జరిగింది. సరిగ్గా ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏమైతే అనుకున్నారో దానికి రివర్స్ లో జరిగింది. స్నేహ తప్ప మిగిలిన వారంతా ఒక్కొక్కరు ఒక్కో చోట నిద్ర పోతూ కనిపించారు. ఒకరు హోటల్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటే, ఇంకొకరు పార్క్ బెంచ్ మీద పడుకున్నారు. ఇంకొకరు కారు వెనుక సీట్లో పడుకుని కనిపించారు. మొత్తానికి ఈ నాలుగు రోజులు నిద్రే పోకూడదనుకున్న గ్యాంగ్ మొదట్లోనే పడుకోవడం భలే ఫన్నీగా అనిపించగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
