Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ వ‌ల్లే మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నా

కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశలో ఓ డైరెక్ట‌ర్ ఉంచిన నమ్మకం ఎలా త‌న‌కి కొత్త జీవాన్ని పోసిందో నటి స్నేహ అనుభవం చెబుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 March 2026 10:00 PM IST
ఆ డైరెక్ట‌ర్ వ‌ల్లే మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నా
X

కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశలో ఓ డైరెక్ట‌ర్ ఉంచిన నమ్మకం ఎలా త‌న‌కి కొత్త జీవాన్ని పోసిందో నటి స్నేహ అనుభవం చెబుతోంది. వరుస స‌క్సెస్‌ల‌తో కెరీర్ పీక్‌లో దూసుకెళ్తున్న టైమ్ లో జరిగిన ఘోర ప్రమాదం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా ఆపేసింది. తీవ్రమైన గాయాల కారణంగా నెలల తరబడి రెస్ట్ అవసరమని డాక్ట‌ర్లు చెప్పడంతో, భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంద‌ని, అదే సమయంలో త‌న‌ను మళ్లీ నిలబ‌డేలా చేసింది మాత్రం ఓ డైరెక్ట‌ర్ విశ్వాస‌మేన‌ని చెప్పారు స్నేహ‌.

నువ్వు త‌ప్ప ఎవ‌రూ చేయ‌లేర‌ని న‌మ్మ‌కం

ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు, క‌రు ప‌ళ‌నియ‌ప్ప‌న్. స్నేహ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పటికీ, పార్థిబ‌న్ క‌నువు లో హీరోయిన్ గా ఆమెనే కావాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసినా, ఆమె టాలెంట్ పై ఆయనకు ఉన్న నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. “మీరు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు” అని ఆయ‌నిచ్చిన ధైర్య‌మే త‌న‌లో కొత్త ఆత్మ‌విశ్వాసాన్ని నింపింద‌ని ఆమె వెల్ల‌డించారు.

ఆయ‌న మాట‌ల‌తోనే న‌మ్మ‌కం

సినీ ఇండ‌స్ట్రీలో అవకాశాలు చాలా వేగంగా మారిపోతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ కెరీర్‌లో వ‌చ్చే చిన్న‌ గ్యాప్ కూడా చాలా పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న స్నేహ‌ను నమ్మి, ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధారణ విషయం కాదు. కానీ కరు పళనియప్పన్ చూపిన ఆ విశ్వాసం స్నేహకు కేవలం ఒక సినిమా అవకాశం మాత్రమే కాదు, ఆమెపై ఆమెకు తిరిగి నమ్మకం కలిగించడంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డింది.

ఆయ‌నిచ్చిన న‌మ్మ‌కం పున‌ర్జ‌న్మ‌లా అనిపించింది

యాక్సిడెంట్ తర్వాత మానసికంగా కుంగిపోయిన ఆమెకు, డైరెక్ట‌ర్ క‌రు ప‌ళ‌నియ‌ప్ప‌న్ ఇచ్చిన ప్రోత్సాహం ఒక పునర్జన్మలా అనిపించిందట. తన శారీరక పరిమితులను అధిగమించేంత ధైర్యం ఆయన మాటల వల్లే వచ్చిందని స్నేహ ఎమోష‌న‌ల్ అవుతూ గుర్తుచేసుకున్నారు. గురువు తన శిష్యునిపై ఉంచే నమ్మకం ఎంత బలమైనదో స్నేహ‌కు క‌రు ప‌ళ‌నియ‌ప్ప‌న్ ఇచ్చిన మోటివేష‌న్ కూడా త‌న‌కు అంతే బ‌లాన్నిచ్చింద‌ని ఆమె చెప్పారు.

పార్థిబన్ కనవు స్నేహ కెరీర్‌లో మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలవడంతో పాటు, ఆమె రీఎంట్రీకి అది బలమైన పునాది వేసింది. ఆ తరువాత స్నేహ తన కెరీర్ జ‌ర్నీని మరింత ధైర్యంగా కొనసాగించారు. ఒక డైరెక్ట‌ర్ న‌టిపై ఉంచిన న‌మ్మ‌కం, ఆమె కెరీర్ ను మాత్రమే కాదు, తిరిగి జీవితాన్నే నిర్మించిందని చెప్పొచ్చు. సినీ రంగంలో టాలెంట్ తో పాటూ దానికి స‌రైన టైమ్ లో లభించే మార్గదర్శకం ఎంత కీలకమో కూడా ఈ ఉదంతం తెలియజేస్తోంది. స్నేహ కథలో యాక్సిడెంట్ ఒక బ్రేక్ మాత్ర‌మే అయితే, కరు పళనియప్పన్ విశ్వాసం ఆ బ్రేక్ ను స‌క్సెస్‌ఫుల్ రీస్టార్ట్ గా మార్చింది.