Begin typing your search above and press return to search.

వివాహాన్ని రద్దు చేసుకున్న స్మృతి.. పరిచయం మొదలు బ్రేకప్ వరకూ.. ఏం జరిగింది?

మరి స్మృతి మంధాన పెళ్లి రద్దు కావడంతో పలాశ్ తో పరిచయం, ప్రేమ,పెళ్లి, బ్రేకప్ ఇలా ఎన్నో విషయాలు వైరల్ గా మారాయి.

By:  Madhu Reddy   |   8 Dec 2025 1:28 PM IST
వివాహాన్ని రద్దు చేసుకున్న స్మృతి.. పరిచయం మొదలు బ్రేకప్ వరకూ.. ఏం జరిగింది?
X

భారతదేశం గర్వించదగ్గ మహిళా క్రికెటర్లలో స్మృతి మంధాన ఒకరు. అలాంటి స్మృతి మంధాన జీవితం ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచింది. దానికి కారణం పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోవడమే. పలాశ్ ముచ్చల్ తో తన పెళ్లి రద్దయినట్టు తాజాగా స్మృతి మంధాన ఓ పోస్ట్ పెట్టింది. దీంతో గత రెండు వారాల నుండి జరుగుతున్న రూమర్లకు తెరదించేసి, ఆరు సంవత్సరాల ప్రేమకి ముగింపు పలికింది. గత కొద్దిరోజులుగా పలాశ్ ముచ్చల్,స్మృతి మంధాన వివాహంపై అనేక పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లకు తెరదించి డిసెంబర్ 7 ఆదివారం తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన పెళ్లి రద్దయినట్టు ఒక ప్రకటన చేసింది. అయితే పెళ్లి రద్దు అయినట్టు తెలిపినప్పటికీ వీరి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటి? అనే విషయం మాత్రం ఇప్పటికీ అభిమానులకు మిస్టరీగానే మిగిలిపోయింది. మరి స్మృతి మంధాన పెళ్లి రద్దు కావడంతో పలాశ్ తో పరిచయం, ప్రేమ,పెళ్లి, బ్రేకప్ ఇలా ఎన్నో విషయాలు వైరల్ గా మారాయి.

2019..

ఈ జంట మొదటిసారి 2019లో ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడి డేటింగ్ ప్రారంభించారు. అప్పటికే స్మృతి మంధాన క్రికెట్లో రాణిస్తుంది. పలాశ్ కి సంబంధించిన ఇంస్టాగ్రామ్ పోస్టులను చూస్తే ఈ జంట ప్రతి సంవత్సరం తమ లవ్ యానివర్సరీ బర్త్డే వేడుకలను జరుపుకున్న ఫోటోలు కనిపిస్తాయి.

2023

అయితే మొదట్లో వీరి మధ్య బంధం గురించి ఎవరికి తెలియకపోయినప్పటికీ.. WPL ఫ్రాంచైజీలో ట్రోఫీని అందుకున్న తర్వాత పలాశ్ , స్మృతి WPL ట్రోఫీతో కలిసి ఫోజులు ఇచ్చిన ఫోటో వైరల్ గా మారడంతో వీరిద్దరి బంధం గురించి చాలా వార్తలు వినిపించాయి.

జూలై 2024- ఐదు సంవత్సరాల వార్షికోత్సవం

గత ఏడాది జూలైలో స్మృతి మంధాన , పలాశ్ ముచ్చల్ లు ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తూ తమ బంధం మొదలై ఐదు సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. దీంతో వీరి రిలేషన్ గురించి మరిన్ని వార్తలు వినిపించాయి

నవంబర్ 2025

భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పై విజయం సాధించి ODI ప్రపంచ కప్ ను అందుకున్నారు. ఇందులో స్మృతి మంధాన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఇక ఇదే సమయంలో స్మృతి మంధాన, పలాశ్ ఇద్దరూ ట్రోఫీ పట్టుకొని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నవంబర్ 21 న DY పాటిల్ స్టేడియంలో పలాశ్ , స్మృతి మంధానాల కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

నవంబర్ 23, 2025

నవంబర్ 23,2025న వీరి పెళ్లి వేడుక ప్రారంభమైంది.కానీ అదే సమయంలో స్మృతి తండ్రి హాస్పిటల్ పాలయ్యాడు. స్మృతి, పలాశ్ ఎంగేజ్మెంట్, సంగీత్,మెహందీ ల ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడింది.

నవంబర్ 24 2025

స్మృతి మంధాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో ఆ తర్వాత రోజే పలాశ్ ముచ్చల్ కూడా హాస్పిటల్ లో చేరారు. దాంతో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ల పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో పలాశ్ తరఫున బంధువులు వీరి పెళ్లి త్వరలోనే జరగబోతుందని తెలిపినప్పటికీ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వినిపించాయి. పైగా ఇన్స్టాగ్రామ్ నుండి ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియోలు తొలగించడం, ఇటీవల కోల్గేట్ యాడ్ వీడియో షేర్ చేయగా.. అందులో తన వేలికి ఎంగేజ్మెంట్ రింగు లేకపోవడమే ఈ అనుమానాలకు కారణమైంది.

డిసెంబర్ 7, 2025

కానీ ఫైనల్ గా స్మృతి మంధాన.. తన పెళ్లి రద్దయిందని అధికారికంగా తెలిపింది. అలా ఆరు సంవత్సరాల వీరి ప్రేమ ఏడడుగులు వేయకుండానే ఆగిపోయింది.