Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది కూడా వదలని పాత స్మృతులు!

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వృత్తిపరంగా ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈమె వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

By:  Madhu Reddy   |   1 Jan 2026 6:09 PM IST
కొత్త ఏడాది కూడా వదలని పాత స్మృతులు!
X

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వృత్తిపరంగా ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈమె వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని, ఒక సుదీర్ఘ నోటు పంచుకుంటూ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని సోషల్ మీడియాలో నెటిజన్లను అభ్యర్థించిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ.. గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితం పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. నా పెళ్లి రద్దయిందని క్లారిటీ ఇస్తున్నాను. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు కూడా వదిలేయండి. మీరు మా ఇరు కుటుంబాల గోప్యాతను గౌరవించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను ఇండియా తరఫున ఎన్నో ట్రోఫీలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం క్రికెట్ పైనే ఉంది. దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే నా ప్రధాన లక్ష్యం.. వీలైనంత కాలం టీమ్ ఇండియా తరఫున ఆడాలని, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో రాసుకుంది.

అలా గత ఏడాది చివరిలో మొత్తం వ్యక్తిగత జీవితం కారణంగానే ఎన్నో రూమర్స్ ఎదుర్కొంది స్మృతి మందాన. అయితే ఇప్పుడు తాజాగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో గత ఏడాది అనుభవాలను ఒక వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది స్మృతి. ఇక తాజాగా స్మృతి షేర్ చేసిన వీడియో విషయానికి వస్తే.. గత సంవత్సర తన ప్రయాణాన్ని ప్రతిబింబించేలా వీడియోని పంచుకుంది .అలాగే తన వ్యక్తిగత, వృత్తి జీవితంలోని కొన్ని మధురమైన క్షణాలను ఫోటోల రూపంలో పంచుకుంది.

స్మృతి మందాన నూతన సంవత్సర సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది . 2025 ఎలా ఉందో ప్రతిబింబిస్తూ షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది . ఇందులో ఆమె తన సహచరులతో నవ్వుతూ.. కుటుంబంతో సమయం గడుపుతూ.. ఒంటరిగా గడిపిన క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు కూడా ఆ వీడియోలో చూపించింది. ఈ వీడియో పై చాలా మంది అభిమానులు ఆమెకు మద్దతు పలికారు. తనకు తానుగా నిజాయితీగా ఉన్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు భారత మహిళా క్రికెట్ కి ఆమె చేసిన కృషికిగాను ఆమెపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఇదే వీడియోలో పలాష్ లేకపోవడాన్ని కొంతమంది ఎత్తి చూపినా.. మరికొంతమంది ఆమె పరిస్థితి గురించి తెలుసుకొని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా స్మృతి మందాన తాజాగా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.