Begin typing your search above and press return to search.

జాలిగా ధీనురాలిని చూసిన‌ట్టు చూస్తే న‌చ్చ‌దు.. స్మృతి మంద‌న ఎమోష‌నల్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన తన క్రికెట్ కెరీర్‌లోని అత్యంత కఠినమైన రోజులు.. వ్యక్తిగత ఎమోష‌న‌ల్ లైఫ్ జర్నీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   13 Sept 2026 5:56 PM IST
జాలిగా ధీనురాలిని చూసిన‌ట్టు చూస్తే న‌చ్చ‌దు.. స్మృతి మంద‌న ఎమోష‌నల్
X

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన తన క్రికెట్ కెరీర్‌లోని అత్యంత కఠినమైన రోజులు.. వ్యక్తిగత ఎమోష‌న‌ల్ లైఫ్ జర్నీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసారు. పాడ్ కాస్ట్ ఇంట‌ర్వ్యూలో హార్డెస్ట్ డేస్ గురించి ప్ర‌శ్నించ‌గా స్మృతి రియాక్ష‌న్ ఆస‌క్తిని క‌లిగించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా రాణిస్తున్న ఈ మ‌హిళా క్రికెట‌ర్ తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందికర క్షణాలు, విమర్శలు.. తన లైఫ్ రూల్స్ గురించి ఓపెన్‌గా ఈ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో... వ్యక్తిగత జీవితంలోనూ అంతే ఆత్మవిశ్వాసంతో ఉంటానని స్పష్టం చేశారు.

తాను తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతానని.. కానీ ఇతరుల నుంచి వచ్చే జాలిని మాత్రం ఏమాత్రం సహించలేనని స్మృతి పేర్కొన్నారు. ``నాకు సింపతీ (సహానుభూతి-జాలి) అంటే అసహ్యం. ఎవరైనా వచ్చి ``ఓహ్, నువ్వు ఔట్ అయ్యావా?`` అంటూ జాలిగా చూడటం నాకు నచ్చదు. నన్ను ఎప్పుడూ ఒక `బెచారి` (అబల)లా చూడకండి.. నేను చాలా స్ట్రాంగ్`` అని ఆమె బోల్డ్‌గా చెప్పారు. తనలోని బాధను ఎవరి ముందూ ప్రదర్శించడానికి ఇష్టపడనని.. అందరూ తనను ఒక సంతోషకరమైన వ్యక్తిలాగే చూడాలని కోరుకున్నారు.

తన వ్యక్తిగత విషయాలు , కుటుంబ నేపథ్యం గురించి ఇంటర్వ్యూలలో ఎందుకు మాట్లాడననే దానిపై కూడా ఆమె స్పష్టతనిచ్చారు. తన కష్టాల గురించి చెప్పి ఇతరుల నుంచి సానుభూతి పొందాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని స్మృతి తెలిపారు. నా ఆటను చూసి ప్రజలు స్ఫూర్తి పొందాలి తప్ప... నా కన్నీళ్ల కథలను చూసి కాదు! అని స్మృతి ఎమోష‌న‌ల్ అయ్యారు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఓటమి తనను ఎంతగానో కలిచివేసినా ఆ చేదు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగానని వెల్లడించారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న స్మృతి మంధాన వ్యాఖ్యలపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఆటలోనే కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలలోనూ స్మృతి చూపించే పరిపక్వతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియోలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.