నా ఇష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదు.. పెళ్లి రద్దు తర్వాత తొలిసారి స్పందించిన స్మృతీ
స్మృతీ మందాన.. ప్రముఖ క్రికెటర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 11 Dec 2025 1:57 PM ISTస్మృతీ మందాన.. ప్రముఖ క్రికెటర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత స్వరకర్త పలాశ్ ముచ్చల్ తో ప్రేమలో పడి ,ఈ ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే సడన్ గా స్మృతీ మందాన తండ్రి హాస్పిటల్ పాలవడం.. ఆ మరుసటి రోజు పలాశ్ ముచ్చల్ కూడా హాస్పిటల్లో అనారోగ్యంతో చేరారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనుకున్న ఈ జంట సడన్గా పెళ్లిని రద్దు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఇకపోతే వీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకోవడానికి అసలు కారణాన్ని తెలియజేయలేదు. కానీ తమ నిర్ణయాన్ని గౌరవించాలని, తమ గోప్యతకు భంగం కలిగించకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించిన విషయం తెలిసింది. ఇకపోతే ఇప్పుడు పెళ్లి రద్దు తర్వాత తొలిసారి ఒక కార్యక్రమంలో పాల్గొన్న స్మృతీ మందాన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తనను ఎవరు అర్థం చేసుకోలేదని, ఇక దానికంటే మించింది మరొకటి లేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్ లో పాల్గొన్న స్మృతీ మందాన మాట్లాడుతూ.. "క్రికెట్ కంటే నాకు మరేది కూడా ఇష్టం లేదు. ఇండియన్ జెర్సీ ధరించామంటే సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి.. ఎలాగైనా సరే విజయం సాధించాలనే కోరిక మనలో బలంగా పాతుకుపోతుంది. ముఖ్యంగా ఆ ఆలోచన మాత్రమే జీవితంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. నిజానికి నాకు చిన్నప్పుడే బ్యాటింగ్ పట్ల ఎంతో పిచ్చి ఉండేది. కానీ దానిని ఎవరూ అర్థం చేసుకోలేదు. అయితే నా మనసులో నేను ఎప్పటికైనా ప్రపంచ ఛాంపియన్ అని పిలవబడాలని కోరుకున్నాను.
నిజానికి నేను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిని. దేని గురించి ఎక్కువగా ఆలోచించి నా జీవితాన్ని కష్టాల మయం చేసుకోను. నేను నమ్మేది ఒక్కటే తెరవెనుక ఎంత పనిచేసిన మైదానంలో ఏం చేస్తున్నారు అనేదే అందరూ చూసి తీర్పు ఇస్తారు. కానీ నేను.. నన్ను లేదా జట్టు గురించి తీర్పు చెప్పేది మనం తెర వెనుక చేసే పని మాత్రమే". అంటూ స్మృతి మందాన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
స్మృతీ మందాన విషయానికి వస్తే.. స్మృతి శ్రీనివాస్ మందాన ఈమె భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్ గా పేరు సొంతం చేసుకుంది. తన అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో విజయాలను అందుకుంది. 2018 జూన్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈమెను ఉత్తమ మహిళ అంతర్జాతీయ క్రికెటర్ గా పేర్కొంది. ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా 2018లో ఎంపికయింది అలాగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈమెకు ఉత్తమ మహిళా క్రికెటర్ గా అవార్డును ప్రధానం చేశారు.
