Begin typing your search above and press return to search.

దీపిక 8గంటల పనిదినాలపై స్మృతి కౌంటర్.. పాయింటే కదా!

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సీనియర్ నటి దీపిక పదుకొనేకి కౌంటర్ ఇచ్చేలా పని గంటల వివాదం గురించి మాట్లాడింది..

By:  Madhu Reddy   |   15 Oct 2025 11:23 AM IST
దీపిక 8గంటల పనిదినాలపై స్మృతి కౌంటర్.. పాయింటే కదా!
X

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ లో పని గంటల మీద వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీపిక పదుకొనే ని ఎప్పుడైతే స్పిరిట్ మూవీ నుండి తొలగిస్తున్నట్టు సందీప్ రెడ్డి వంగా చెప్పారో అప్పటి నుండి ఈ వివాదం మొదలైంది. అలాగే కల్కి పార్ట్ 2 నుండి కూడా దీపికా పదుకొనేని తొలగిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. అయితే ఈ వివాదంపై దీపికా పదుకొనే అప్పుడు మాట్లాడకపోయినప్పటికీ.. మొన్నా మధ్య ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు రోజుకు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. పైగా శని ఆదివారాలు వారికి సెలవు.. వారిని ఎవరు ప్రశ్నించరు.? కానీ మమ్మల్ని మాత్రం పని గంటల మీద ఎందుకు విమర్శిస్తారు" అంటూ కౌంటర్ ఇచ్చింది. అలా బాలీవుడ్లో దీపిక పదుకొనే మాట్లాడిన ఈ మాటలపై కొంతమంది సపోర్ట్ చేస్తే.. మరి కొంత మంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సీనియర్ నటి దీపిక పదుకొనేకి కౌంటర్ ఇచ్చేలా పని గంటల వివాదం గురించి మాట్లాడింది..

ఆమె ఎవరో కాదు సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు స్మృతీ ఇరానీ.. స్మృతి ఇరానీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈమె ఈ మధ్యనే మళ్లీ తనకు పేరు తెచ్చిపెట్టిన సీరియల్ సీక్వెల్ ద్వారా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. అయితే స్మృతి ఇరానీకి బీటౌన్ లో జరుగుతున్న పని గంటల వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. "పని గంటల గురించి ఈమధ్య ఇండస్ట్రీలో పెద్ద వివాదమే నడుస్తోంది. దీన్ని కొంతమంది నెగటివ్ చేసి మరింత పెద్దది చేస్తున్నారు. కానీ ఈ అంశంపై మాట్లాడి నెగిటివ్ గా మాట్లాడి వివాదంలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. పెద్ద సినిమాల నుండి దీపికా పదుకొనేని తీసేసారు అంటే పూర్తిగా అది ఆమె వ్యక్తిగత విషయం. దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు.

అందరి సంగతేమో కానీ నేను మాత్రం నా పని పట్ల అంకితభావంతో ఉంటాను. నిర్మాతలకు ఎప్పుడు లాభాలు తెచ్చిపెట్టేలాగే చేస్తాను. నేను సీరియల్స్ చేస్తున్న టైంలోనే నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ టైంలో పిల్లలు ఉన్నా కూడా నిర్మాతల లాభం గురించి ఆలోచించాను. ఒకరోజు నేను షూటింగ్ కి వెళ్లకపోతే 120 మందికి పని ఉండదు. నాకోసం 120 మంది కుటుంబాలకు అన్యాయం జరగడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేనెప్పుడూ కూడా నిర్మాతల లాభాల గురించి, వారికి న్యాయం జరగడం గురించే ఆలోచించేదాన్ని. రాజకీయాల్లో రాణించడం.. నటిగా రాణించడం.. పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ నా ఎంపికే కాబట్టి వీటన్నింటికీ నేను సమాన న్యాయం చేసేదాన్ని. ఎప్పుడూ కూడా నిర్మాతల లాభాన్ని దృష్టిలో పెట్టుకునేదాన్ని. అందుకే వారికి నష్టాలు రాకుండా ఉండడానికి ఎంత కష్టమైనా పనిచేసేదాన్ని" అంటూ స్మృతి ఇరానీ చెప్పుకొచ్చింది.

దీంతో స్మృతి ఇరానీ మాట్లాడిన మాటలు దీపికా పదుకొనే కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే స్మృతి ఇరానీ తన పర్సనల్ లైఫ్ ని చూసుకోకుండా నిర్మాతల కోసం కష్టపడ్డానని చెప్పింది. దీనికి తోడు స్మృతి ఇరానీ కామెంట్స్ విన్న కొంతమంది నెటిజన్స్ ఇది కూడా పాయింటే కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.

స్మృతి ఇరానీ సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఆమె గత 25 ఏళ్ల క్రితం ' క్యోంకీ సాస్ భీ కబీ బహు థీ' అనే హిందీ సీరియల్ లో తులసి అనే గృహిణి పాత్రలో చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఇంత హిట్ అయిన ఈ సీరియల్ కి ఈ ఏడాది సీక్వెల్ కూడా ప్రారంభించారు. అలా క్యోంకీ సాస్ భీ కభీ బాహు థీ 2 అనే సీరియల్ కోసం మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.