Begin typing your search above and press return to search.

ఆమె యాక్టింగ్ కు రూ.14 లక్షలు అవసరమా?

బుల్లితెర నటిగా ఆమెకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీ సీరియల్‌ క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీతో అందరినీ ఆకట్టుకున్నారు.

By:  M Prashanth   |   7 Sept 2025 9:00 AM IST
ఆమె యాక్టింగ్ కు రూ.14 లక్షలు అవసరమా?
X

ఒక్కో ఎపిసోడ్ కు రూ.14 లక్షల రెమ్యునరేషన్.. బుల్లితెరలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్‌.. కానీ తీరా ఇప్పుడు చూస్తే.. యాక్టింగ్ లో ఫెయిల్ అంటూ విమర్శలు.. అంత పారితోషికం అవసరమా అంటూ క్వశ్చన్లు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అదంతా ఎవరి కోసమంటే.. నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ గురించి.

బుల్లితెర నటిగా ఆమెకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీ సీరియల్‌ క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీతో అందరినీ ఆకట్టుకున్నారు. 2000 జులైలో ప్రారంభమైన ఆ సీరియల్.. 2008 నవంబర్ వరకు సక్సెస్ ఫుల్ గా ప్రసారమైంది. అందులో స్మృతి ఇరానీ గృహిణి తులసి పాత్రలో నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు.

పలు అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి టీవీలో కాకుండా జియో సినిమా, స్టార్‌ ప్లస్‌ లో ప్రసారమవుతోంది. కానీ స్మృతి నటనకు విమర్శలు వస్తున్నాయి. ఆమె యాక్టింగ్ సంతృప్తికరంగా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

సీరియల్ లో ఆమె అతిగా నటించినట్లు అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు రీఎంట్రీ అనుకున్నట్లు యాక్ట్ చేయడం లేదని.. పలు సీన్స్ లో అలా అవసరమా అని అనిపిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో ఎపిసోడ్ కు రూ.14 లక్షలు కూడా చెల్లించడం అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. హైయెస్ట్ ఆమెకేనని గుర్తు చేస్తున్నారు.

ఆ సీరియల్ లో ఉన్న ఇతర నటీమణులు రూపాలీ గంగూలీ, హీనాఖాన్ ఒక్కో ఎపిసోడ్‌ కు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరి కన్నా స్మృతి ఎక్కువ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని కొన్ని రోజుల క్రితం పరోక్షంగా అంగీకరించారు కూడా. అందరికంటే ఎక్కువ పారితోషికం పొందుతున్న నటిని తానేని తెలిపారు.

గతంలో ఆ సీరియల్‌ ప్రేక్షకాదరణతో పాటు రేటింగ్‌ పరంగానూ టాప్‌లో ఉందని, అలాంటప్పుడు కోరినంత ఇస్తారని అన్నారు. తాము నటీనటుల్లానే కాంట్రాక్టర్స్‌తో మాట్లాడుకుని ఒప్పందం చేసుకుంటామని, ఆ వివరాలు బయటకు వెల్లడించలేమని తెలిపారు. ఇప్పుడు ఆమె యాక్టింగ్.. సీరియల్ కు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది.