Begin typing your search above and press return to search.

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్‌కి త‌నే హాట్ ఫేవ‌రేట్ హీరో!

తెలుగులో ఇటీవ‌ల విడుద‌లైన చిన్న చిత్రాలు భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే.

By:  Ravindar Gorantla   |   13 March 2026 4:00 PM IST
కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్‌కి త‌నే హాట్ ఫేవ‌రేట్ హీరో!
X

టాలీవుడ్ టు కోలీవుడ్ చిన్న సినిమాలు అద్భుత విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి. చిన్న బ‌డ్జెట్‌తో అర్థ‌వంత‌మైన‌, మ‌న‌సుని హ‌త్తుకునే క‌థ‌ల‌తో చేస్తున్న సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఆయా సినిమాలు కాసుల వ‌ర్షం కురిపిస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. తెలుగులో ఇటీవ‌ల విడుద‌లైన చిన్న చిత్రాలు భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో రాధిక శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

`తాయ్ కిళ‌వి` పేరుతో రూపొందిన ఈ సినిమా త‌మిళ నేటివిటీ నేప‌థ్యంలో ప‌క్కా రూటెడ్ స్టోరీగా తెర‌కెక్కి అక్క‌డి ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోనూ ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సినిమా ఇంత‌గా హాట్ టాపిక్‌గా మార‌డానికి కార‌ణం కీల‌క పాత్ర‌లో న‌టించిన రాధిక శ‌ర‌త్‌కుమార్ న‌ట‌న ఓ కార‌ణం కాగా..దీన్ని హీరో శివ‌కార్తికేయ‌న్ నిర్మించ‌డం మ‌రో కార‌ణం. ఫిబ్ర‌వ‌రి 27న విడుద‌లై బెస్ట్ రూర‌ల్ డ్రామాగా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఇందులో న‌టించిన రాధిక వ‌న్ మెన్ షోగా సినిమాని న‌డిపించిన తీరు, తాయ్ క్యారెక్ట‌ర్‌లో తను జీవితంచిన విధానం సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌బెట్టి ఆమెపై ద‌క్షిణాది స్టార్స్ ప్ర‌శంస‌లు కురిపించేలా చేస్తోంది.

ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌తో క‌లిపి భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. త‌మిళ‌నాడులో రూ.44.95 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ. 3.88 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.52 ల‌క్ష‌లు (త‌మిళ వెర్ష‌న్‌) రెస్ట్ ఆఫ్ ది ఇండియా రూ. 78 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ రూ.60.01 కోట్లు. ఈ సినిమాతో శివ‌కార్తికేయ‌న్ ఎంతో మందికి హాట్ ఫేవ‌రేట్ అయిపోయాడు. రాధిక న‌టించిన ఈ సినిమా త‌మిళ‌నాట విజ‌య‌దుందుభి మోగిస్తూ క‌లెక్ష‌న్‌ల దుమ్ముదుళుపుతోంది.

ఇంత మంచి సినిమా తీసినందుకు శివ‌కార్తికేయ‌న్‌ని అంతా అభినందిస్తున్నారు. దీంతో కోలీవుడ్‌లో సీనియ‌ర్ స్టార్ల‌తో పాటు క్రేజీ స్టార్ల‌కు శివ కార్తికేయ‌న్ హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయాడు. సీనియ‌ర్ స్టార్స్ అత‌న్ని ఆప్యాయంగా ద‌గ్గ‌రికి తీసుకుని అభినందిస్తున్న తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంద‌ర్భంగా హీరో శివ‌కార్తికేయ‌న్ టీమ్ అంద‌రికి నాన్ వెజ్ పార్టీ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా తానే ద‌గ్గ‌రుండి చూసుకున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇటీవ‌ల ప‌రాశ‌క్తి` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన శివ కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో నిర్మిస్తున్న `సేయోన్‌`లో న‌టిస్తున్నాడు. ప‌క్కా రూటెడ్ స్టోరీగా డివోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అంశ‌లో పుట్టిన ఓ యువ‌కుడి నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ అండ్ డివోష‌న‌ల్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. శివ‌కార్తికేయ‌న్ మేకోవ‌ర్‌, క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇటీవ‌లే శివ‌కార్తికేయ‌న్ పుట్టిన రోజు సంద‌ర్‌భంగా విడుద‌ల చేసిన గ్లింప్స్ ఆక‌ట్టుకుంది.