Begin typing your search above and press return to search.

స్లమ్ డాగ్ టీజర్.. పూరి మార్క్ యాక్షన్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' టీజర్ సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  M Prashanth   |   8 Jun 2026 6:48 PM IST
స్లమ్ డాగ్ టీజర్.. పూరి మార్క్ యాక్షన్
X

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' టీజర్ సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ గ్లామర్ ప్రపంచం, స్టైలిష్ హీరోల చుట్టూ కథలు రాసుకునే పూరి ఈసారి పూర్తిగా తన రూట్ మార్చి ఒక మురికివాడ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లు అర్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఒకేసారి రాబోతున్న ఈ సినిమా పూరికి ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.





ఈ టీజర్ చూశాక అందరూ మాట్లాడుకుంటున్నది విజువల్స్ గురించే. స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్, చీకటి, వర్షం పడే సీన్స్ తో సినిమా మూడ్ ఏ స్థాయిలో ఉండబోతుందో దర్శకుడు చాలా క్లియర్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ ఆ రస్టిక్ ఫీల్ ను ఎక్కడా ఆర్టిఫిషియల్ గా అనిపించకుండా చాలా న్యాచురల్ గా తెరపైకి తీసుకువచ్చింది. పూరి గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఇందులో ఒక సీరియస్ డార్క్ వాతావరణం కనిపిస్తోంది.

ఇక ఇందులో విజయ్ సేతుపతి తన రఫ్ లుక్, యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. చేతిలో గన్నులు, ఆయుధాలు పట్టుకుని మురికివాడల మధ్య సీరియస్ గా నడిచే సీన్స్ లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఒక్క వాన పడితే కాకుల చెట్ల కింద దాక్కునే జీవితాలు.. అంటూ మొదలయ్యే డైలాగ్ పాత పూరి మార్క్ రైటింగ్ ను మనకు గుర్తుచేస్తుంది. పేదల బతుకులతో ఆడుకుంటే వదిలిపెట్టను అంటూ చెప్పే ఎమోషన్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేశారు.

మిగతా క్యాస్టింగ్ విషయానికి వస్తే బాలీవుడ్ సీనియర్ నటి టబు పాత్ర ఈ కథలో చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అల్లర్ల మధ్య నడుచుకుంటూ వచ్చే షాట్ లో ఆమె లుక్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. హీరోయిన్ సంయుక్త తో పాటు దునియా విజయ్, బ్రహ్మాజీ, విటివి గణేష్, జరీనా వహాబ్ లాంటి భారీ తారాగణం ఈ మురికివాడల కథలో కీలకమని అర్ధమవుతుంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బీజీఎం ఈ టీజర్ లోని డార్క్ థీమ్ కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మంటలు, రక్తపాతం, తుపాకీ కాల్పులు చూపిస్తూ చాలా రఫ్ గా కట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కథలోని ఇంటెన్సిటీని పెంచాయి. ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రా కట్ తో ఈ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఓవరాల్ గా చూస్తే స్లమ్ డాగ్ టీజర్ దర్శకుడు పూరి మేకింగ్ స్టైల్ లో ఒక పెద్ద మార్పును హైలెట్ చేస్తోంది. తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా కథపై, పాత్రల ఎమోషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఈ చిన్న టీజర్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.