'స్లమ్ డాగ్' పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్లే.. కానీ!
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ పోషిస్తున్నారు.
By: M Prashanth | 17 Oct 2026 1:37 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కు మూవీ టీమ్ రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపింది. హైదరాబాద్ లో జరిగిన చివరి షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం ముగిసింది. దీంతో సినిమా ప్రొడక్షన్ లో ఓ పెద్ద పని పూర్తయినట్లే.
కానీ ఇప్పుడు మూవీ టీమ్ ముందు మరికొన్ని మెయిన్ టాస్క్ లు ఉన్నాయి. షూటింగ్ పూర్తయినంత మాత్రాన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు కాదు. ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలి. మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాలి. ఆ తర్వాత ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి. ఆ పనులన్నీ పూర్తయితేనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి లైన్ క్లియర్ అవుతుంది.
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఆ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రోల్స్ ఇంట్రడక్షన్ వీడియోస్.. సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. ఒక్కో రోల్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలు సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.
పూరీ జగన్నాథ్ సినిమాల్లో స్టోరీ చెప్పే విధానం, రోల్స్ చూపించే తీరు స్పెషల్ గా ఉంటాయి. ఆ సినిమాలోనూ అలాంటి అంశాలతో పాటు యాక్షన్, డ్రామాకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు విజయ్ సేతుపతి ఆ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయనకు ఉన్న యాక్టింగ్ తో రోల్ కు ఎలాంటి స్పెషాలిటీ తీసుకొస్తారో చూడాలి.
ఇక సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ప్రతి రోల్ కు ఇంపార్టెన్స్ ఉంటుందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ చెబుతున్నాయి. ఇప్పుడు సినిమాకు సంబంధించిన టెక్నికల్ వర్క్స్ ను కూడా మూవీ టీమ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సామ్ కె. నాయుడు నిర్వహిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ చేస్తున్నారు. అనిల్ పడూరి విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చూస్తున్నారు. సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల ముందుకూ తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. మరి పూరీ జగన్నాథ్ సినిమాను ఎప్పుడు తీసుకొస్తారు.. విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
