Begin typing your search above and press return to search.

రాజా సాబ్ థియేటర్లు.. SKN అలా అన్నాడేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్.. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే

By:  M Prashanth   |   8 Jan 2026 12:00 PM IST
రాజా సాబ్ థియేటర్లు.. SKN అలా అన్నాడేంటి?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్.. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలవ్వనున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం.. కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

అయితే సంక్రాంతికి రాజా సాబ్ తో పాటు తెలుగు నుంచి మరో నాలుగు స్ట్రయిట్ మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ ముందు వచ్చేది మాత్రం రాజా సాబ్ నే. అదే సమయంలో ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్స్ విషయంలో కచ్చితంగా సమస్య వస్తుంది. తమ సినిమాకు ఎక్కువ థియేటర్స్ రావాలని ఆయా చిత్రాల మేకర్స్ ట్రై చేస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగే విషయమే.

అదే సమయంలో సంక్రాంతికి రాజా సాబ్ మూవీ ముందుగా వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి నటించిన సినిమాలు వస్తాయి. కాబట్టి ముందు రాజా సాబ్ కు ఎక్కువ థియేటర్స్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం కౌంట్ తగ్గిపోతుంది. కచ్చితంగా కొన్ని థియేటర్స్ ను వదులు కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు థియేటర్స్ కేటాయింపు విషయంపై పరోక్షంగా నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి

రీసెంట్ గా జరిగిన రాజా సాబ్ ప్రమోషనల్ ఈవెంట్ కు వచ్చిన ఆయన వేదికపై మాట్లాడారు. ఆ సమయంలో థియేటర్స్ విషయాన్ని ప్రస్తావించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాగా వస్తున్న రాజా సాబ్ కు టాలీవుడ్ పెద్దలంతా కోపరేట్ చేస్తారని ఆశిస్తున్నట్లు ఎస్కేఎన్ తెలిపారు. అంతే కాదు.. సినిమాకు సహకరించిన వారి పేర్లు అన్నీ సంక్రాంతి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తానని అన్నారు.

ఆ సమయంలో తాను అందరి పేర్లు చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమాకు ఒక్క థియేటర్ ఇస్తే వందసార్లు చెప్పుకుంటానని, కానీ అదే ఒక్క థియేటర్ ఇవ్వకపోతే మాత్రం 200 సార్లు చెబుతానని అన్నారు. అందుకే అందరూ సహకారం అందించాలని కోరారు. ఆ తర్వాత రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గతంలో నిర్మించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మిరాయ్ గురించి మాట్లాడారు.

ఆ మూవీ బాగా ఆడిందని, కానీ ఆ సమయంలో ఓ పెద్ద సినిమా వచ్చిన విషయాన్ని ఎస్కేఎన్ గుర్తు చేశారు. దీంతో కొన్ని థియేటర్స్ లో తన సినిమాను విశ్వప్రసాద్ తీసేశారని చెప్పారు. ఇప్పుడే ఆయన తీసిన రాజా సాబ్ వస్తుందని, కాబట్టి పెద్దలంతా సహకరించాలని అన్నారు. దీంతో థియేటర్స్ కేటాయింపు విషయంలో ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.