హీరోయిన్ రాఖీ గిఫ్ట్: చెల్లెమ్మకు రాఖీ కానుకగా ఏమిచ్చావ్ అన్నా?
రక్షా బంధన్ పండుగ వేళ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత SKN .. రైజింగ్ యువ కథానాయిక శ్రీగౌరి ప్రియల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
By: Sivaji Kontham | 28 Aug 2026 10:48 PM ISTరక్షా బంధన్ పండుగ వేళ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత SKN .. రైజింగ్ యువ కథానాయిక శ్రీగౌరి ప్రియల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీగౌరి ప్రియతో ఉన్న పవిత్రమైన బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎస్.కే.ఎన్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.
ఇటీవలి `చెన్నై లవ్‌స్టోరి` నిర్మాణ సమయంలో శ్రీగౌరి ప్రియ సినిమాపై చూపించిన అంకితభావం, నటనపై ఆమెకున్న అపారమైన ప్రేమ తమ మధ్య ఒక అందమైన అనుబంధాన్ని ఏర్పరిచాయని SKN భావోద్వేగంగా పేర్కొన్నారు. శ్రీగౌరిని తన సొంత తమ్ముడు (చెల్లెలి)లా భావిస్తున్నానని.. జీవితాంతం తనకు తోడుగా ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చారు. ఇద్దరం కలిసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ `మై రాక్ స్టార్` అని రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
SKN ఆత్మీయ పోస్ట్‌కు శ్రీగౌరి ప్రియ కూడా అంతే భావోద్వేగంతో స్పందించింది. ``థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్`` అని కామెంట్ చేస్తూ తన కృతజ్ఞతను చాటుకుంది. సినిమా ప్రమోషన్లలో శ్రీగౌరి ప్రియ ప్రతిభను ఆకాశానికెత్తేస్తూ ఎస్.కె.ఎన్ చేసిన ప్రచారం.. తన వెన్నంటి ఉండి ప్రోత్సహించిన తీరుపై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కనెక్షన్‌ను ఆవిష్కరించడం విశేషం.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు, అభిమానులు సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. పోస్ట్‌లో SKN `తమ్ముడు` అని రాయడంతో కొందరు ``తమ్ముడు కాదు అన్నా.. చెల్లి`` అని సరిదిద్దగా, మరికొందరు ``చెల్లెమ్మకు రాఖీ కానుకగా ఏమిచ్చావ్ అన్నా?`` అని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సోదరీసోదరుల బంధాన్ని చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
సినీ పరిశ్రమలో కథానాయికలు తమను ప్రోత్సహించిన నిర్మాతలను కేవలం వ్యాపార భాగస్వాములుగా కాకుండా, సొంత సోదరులుగా భావించడం కొత్తేమీ కాదు. తమ కెరీర్‌కు పునాది వేసి.. నిరంతరం అండగా నిలిచే నిర్మాతలకు పండుగల వేళ ప్రత్యేకంగా రాఖీలు కట్టడం.. అరుదైన కానుకలు ఇచ్చి తమ గౌరవాన్ని, ప్రేమాభిమానాలను చాటుకోవడం టాలీవుడ్‌లో తరచుగా చూస్తుంటాం. నిర్మాత-హీరోయిన్ అనుబంధాన్ని మించి ఒక గొప్ప రక్త సంబంధంలా నిలిచే ఈ ఆత్మీయతలు ఇండస్ట్రీలో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
