Begin typing your search above and press return to search.

OTT : 'A' సీన్స్‌ వచ్చేప్పుడు స్కిప్‌ కొట్టొచ్చా?

ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది. గత అయిదు సంవత్సరాల్లో ఓటీటీ కంటెంట్‌ ను చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది.

By:  Ramesh Palla   |   19 Nov 2025 2:00 AM IST
OTT : A సీన్స్‌ వచ్చేప్పుడు స్కిప్‌ కొట్టొచ్చా?
X

ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది. గత అయిదు సంవత్సరాల్లో ఓటీటీ కంటెంట్‌ ను చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. సాధారణంగా ఒకప్పుడు ఓటీటీ కంటెంట్‌ అంటే అశ్లీలత ఎక్కువ ఉంటుంది. వెబ్‌ సిరీస్‌ అంటే బూతులు, ముద్దు సీన్స్‌, అంతకు మించిన శృంగార సీన్స్ ఉంటాయి అనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రముఖ ఓటీటీలు కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఓటీటీ కంటెంట్‌ను తీసుకు వచ్చాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఓటీటీ లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తున్నారు. కొన్ని ప్రత్యేకంగా ఓటీటీ కోసం రూపొందిన సినిమాల్లో అశ్లీలత శృతి మించి ఉంటుంది. సినిమా మొత్తం బాగానే ఉంటుంది. కానీ అక్కడ అక్కడ ఉండే అశ్లీల సీన్స్ వల్ల ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. ఇది అన్ని ఓటీటీలపై ఉన్న కంప్లైంట్‌.

ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌ కంటెంట్‌...

ఇటీవల ఒక ప్రముఖ ఓటీటీలో సినిమా మధ్యలో ఎక్కువగా కండోమ్‌ యాడ్స్ వస్తూ ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. సదరు ఓటీటీ వారు ఇప్పటికే చర్యలు తీసుకుని, సదరు యాడ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో కొత్త ఫీచర్‌ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అదేంటి అంటే సినిమాలో లేదా వెబ్‌ సిరీస్‌ లో అశ్లీల సీన్‌ వచ్చే ముందు స్కిప్‌ అనే ఆప్షన్ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని ఓటీటీలు టైటిల్‌ కార్డ్స్ ను స్కిప్‌ చేసే అవకాశంను ఇచ్చింది. అలాగే కొన్ని పాటలను స్కిప్‌ చేసే విధంగా కూడా ఆప్షన్‌ ను పెట్టాయి. అందుకే ఇప్పుడు శృంగార సీన్స్‌ ను స్కిప్‌ చేసే విధంగా ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

వెబ్‌ సిరీస్‌ ల్లో అశ్లీల సీన్స్‌...

ఈ మధ్య కాలంలో ఓటీటీల్లో కంటెంట్‌ ను ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ చూస్తున్నారు. తీరిక సమయంలో, ముఖ్యంగా వీకెండ్స్ లో ఓటీటీ ల్లో సినిమాలు సిరీస్ లు చూస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూస్తున్న సమయంలో మధ్యలో శృంగార సన్నివేశాలు వస్తే అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే రిమోట్‌ పట్టుకుని స్కిప్‌ కొట్టే అవకాశం ఉంటే ఫ్యామిలీ లో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండవచ్చు కదా అనేది చాలా మంది అభిప్రాయం. నెట్‌ఫ్లిక్స్ వంటి ఫ్యామిలీ కంటెంట్‌ను ఇచ్చే ఓటీటీలు ఈ స్కిప్‌ ఆప్షన్ ను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. ముందు ముందు ఈ స్కిప్‌ ఆప్షన్ ఇచ్చే విధంగా ఎక్కువ మంది నెటిజన్స్‌ ఈ విషయాన్ని ఓటీటీల ముందు ఉంచాలని ఇప్పటికే కొందరు ప్రచారం చేస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఓటీటీ కంటెంట్‌

మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న ఓటీటీ వినియోగం నేపథ్యంలో ఇలాంటివి తీసుకు వస్తేనే కొత్త ప్రేక్షకులను ఓటీటీ సంస్థలు తమ వైపు తిప్పుకుంటాయి. ఫ్యామిలీతో చూడాలి అంటే ఓటీటీ కంటే టీవీ ఉత్తమం అని చాలా మంది అనుకుంటున్నారు. ఓటీటీ కంటెంట్ ను దొంగ చాటుగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటూ కొందరు అంటున్నారు. ఇప్పటికే ఓటీటీ కంటెంట్‌ కి సెన్సార్ ఉండాలి అనే డిమాండ్‌ వినిపిస్తుంది. అది ఎలాగూ అందుబాటులోకి రావడం లేదు. కనుక ఓటీటీలు స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఓటీటీల్లో అతి హింస, అతి శృంగార సీన్స్‌ ఉన్నప్పుడు తప్పకుండా స్కిప్‌ ను కొట్టే అవకాశం ఇవ్వాలి. ఈ విషయమై అన్ని ఓటీటీ సంస్థలు ఆలోచిస్తే బాగుంటుంది. ముందు ముందు ఈ మార్పు ఓటీటీల్లో వస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.