ప్యాక్ కోసం స్టార్‌హీరో స్టెరాయిడ్లు వాడారా?
ఒక్కోసారి స్టార్లపై వచ్చే పుకార్లు అభిమానులను గందరగోళంలో పడేస్తుంటాయి. అలాంటి ఒక గందరగోళం కొంత కాలంగా శివకార్తికేయన్ అభిమానుల్లోను ఉంది.
By: Sivaji Kontham | 4 Sept 2025 10:11 AM ISTఒక్కోసారి స్టార్లపై వచ్చే పుకార్లు అభిమానులను గందరగోళంలో పడేస్తుంటాయి. అలాంటి ఒక గందరగోళం కొంత కాలంగా శివకార్తికేయన్ అభిమానుల్లోను ఉంది. ఆయన 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ కోసం స్టెరాయిడ్లు అదుపు తప్పి ఉపయోగించారని సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం సాగింది. వరుసగా యూట్యూబ్ కథనాలు వైరల్ అయ్యాయి.
అయితే ఆయన స్టెరాయిడ్లు వాడారా? అంటే .. తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని శివకార్తికేయన్ ఖండించారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లు తనపై ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆయన అన్నారు. నా ముఖానికి 6 ప్యాక్ లేదా 8 ప్యాక్ ఉన్న బాడీని మార్ఫ్ చేసి ఇలా అవ్వడానికి స్టెరాయిడ్లు ఉపయోగించాడని ప్రచారం చేసారు. అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడన్న ప్రచారం హోరెత్తించారు. ఒక యూట్యూబర్ అయితే, ఒకసారి నా ముఖాన్ని పెద్దదిగా చేసి కూడా చూపించారు. స్టెరాయిడ్లు వాడకం వల్లనే ఇలా అయ్యాడు! అంటూ తప్పుడు కథనాల్ని ప్రచురించారు. నిజానికి నాకు సింగిల్ ప్యాక్ కూడా లేదు. బాడీ మేకోవర్ కోసం జిమ్ లో శ్రమించాను అంతే! అని శివ కార్తికేయన్ వివరణ ఇచ్చారు. 8ప్యాక్ కోసం తాను అస్సలు ప్రయత్నించలేదని క్లారిటీనిచ్చారు.
'అమరన్' కోసం తాను మేకోవర్ ప్రయత్నించగా, ఆ సినిమా విడుదల సమయంలో తనపై ఇలాంటి ప్రచారం సాగిందని తెలిపారు. కొందరు ముఖాన్ని పెద్దదిగా చేసి చూపించి అనారోగ్యం అని పేర్కొనడాన్ని శివకార్తికేయన్ ఆక్షేపించారు. నకిలీ ఫోటోలతో ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని సూచించారు. అమరన్ శివకార్తికేయన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 300 కోట్లు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన 'మదరాసి' విడుదలకు సిద్ధమవుతోంది. ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్ తాను చెప్పిన కథ వినగానే ఓకే చెప్పారని మురుగదాస్ ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సికిందర్ లాంటి భారీ పరాజయం తర్వాత కంబ్యాక్ కోసం మురుగదాస్ చేస్తున్న ప్రయత్నమిది.
