శివ కార్తికేయన్ 'పరాశక్తి' నుండి ఫస్ట్ సింగిల్!
ఈ మధ్యనే మదరాసి సినిమాతో అభిమానులను పలకరించిన శివ కార్తికేయన్.. త్వరలోనే పరాశక్తి అనే మరో మూవీతో రాబోతున్నారు.
By: Madhu Reddy | 7 Nov 2025 3:35 PM ISTఈ మధ్యనే మదరాసి సినిమాతో అభిమానులను పలకరించిన శివ కార్తికేయన్.. త్వరలోనే పరాశక్తి అనే మరో మూవీతో రాబోతున్నారు. సుధా కొంగర డైరెక్షన్లో వస్తున్న పరాశక్తి సినిమా నుండి తాజాగా మూవీ మేకర్స్ మొదటి పాటను విడుదల చేశారు. ప్రస్తుతం పరాశక్తి మూవీ నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. తాజాగా పరాశక్తి మూవీ మేకర్స్ "సింగారాల సీతాకోకవే" అనే పాట ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ టాక్ అందుకుంటుంది... శివ కార్తికేయన్ హీరోగా.. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 14న అంటే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదల కాబోతోంది.
సీన్ రోల్డన్, మరియు దీ, ఎల్వి రేవంత్ కలిసి పాడిన ఈ పాటకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించారు. ప్రముఖ లిరిసిస్ట్ భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. జీవి ప్రకాష్ చేసిన 100వ మ్యూజిక్ ఆల్బమ్ ఇది కావడంతో ఈ పాట పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డైరెక్టర్ సుధా కొంగర ప్రత్యేకమైన విజువల్స్, జీవి ప్రకాష్ యొక్క అద్భుతమైన సంగీతం, సాహిత్యంలోని లోతు ప్రేక్షకులను చాలా తొందరగా ఆకర్షించాయి. ఈ పాటలో శివ కార్తికేయన్, శ్రీలీల కలిసి నటించిన సన్నివేశాలు అభిమానుల నుండి మంచి ఆదరణ పొందాయి.
అలా మొదటి సాంగ్ తోనే సినిమాపై భారీ హైప్ పెంచేశారు చిత్ర యూనిట్. ఇక శివ కార్తికేయన్ పరాశక్తి మూవీలో అధర్వ, జయం రవి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమరన్,మదరాసి సినిమాల తర్వాత శివ కార్తికేయన్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే లేడీ డైరెక్టర్ అయినా సరే తన దర్శకత్వ ప్రతిభతో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధా కొంగర మీద నమ్మకం పెట్టుకొని శివ కార్తికేయన్ ఈ అవకాశం ఇచ్చారు.అలా ఇప్పటికే సుధా కొంగర డైరెక్షన్లో వచ్చిన సూరరై పోట్రు( ఆకాశమే నీ హద్దురా) ఇరుధి సుట్రు వంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలా సుధా కొంగర డైరెక్షన్ వహించిన ఈ పీరియాడిక్ డ్రామా వింటేజ్ వైబ్స్ ని తీసుకువస్తుంది అంటూ తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ని చూసి ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
శివ కార్తికేయన్ నటిస్తున్న ఈ పరాశక్తి మూవీ మొదట సూర్య చేయాల్సి ఉంది. అలా మొదట సుధా కొంగర డైరెక్షన్లో పురాననూరు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కెది. కానీ ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో ఇందులో శివ కార్తికేయన్ ని హీరోగా తీసుకున్నారు. భారత వ్యతిరేక ఉద్యమంపై కేంద్రీకృతమైన ఓ కాన్సెప్ట్ తో పరాశక్తి మూవీ తెరకెక్కబోతోంది. శివ కార్తికేయన్ కెరియర్ లో పరాశక్తి మూవీ అతి పెద్ద మైలురాయిగా నిలవబోతుందని ఆయన భావిస్తున్నారు. శివ కార్తికేయన్ అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మదరాసి మూవీతో వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ పరాశక్తి మూవీ మాత్రం ఆయన కెరీయర్ ని మార్చేస్తుంది అని శివ కార్తికేయన్ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి శివ కార్తికేయన్ కి పరాశక్తి మూవీ ఏ విధంగా పేరు తీసుకువస్తుందో.
