Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో మ‌రోసారి క‌లిసింది!

సాదా సీదా క్యారెక్ట‌ర్ల‌తో ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి కోలీవుడ్‌లోని టాప్ స్టార్ల‌లో ఒక‌డిగా స్థానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో శివ కార్తికేయ‌న్‌.

By:  Tupaki Entertainment Desk   |   16 Feb 2026 5:57 PM IST
బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో మ‌రోసారి క‌లిసింది!
X

సాదా సీదా క్యారెక్ట‌ర్ల‌తో ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి కోలీవుడ్‌లోని టాప్ స్టార్ల‌లో ఒక‌డిగా స్థానాన్ని సొంతం చేసుకున్నాడు హీరో శివ కార్తికేయ‌న్‌. 25వ మూవీ `ప‌రాశ‌క్తి`తో ఈ సంక్రాతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చ‌యాడు. హిందీ వ్య‌తిరేకోద్య‌మం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాకు ఫ‌స్ట్ డే నుంచే డివైడ్ టాక్ వినిపించింది. అయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్లు రాబ‌ట్టి ఔరా అనిపించింది. ఇప్పుడు 26వ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించాడు. దీన్ని రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్‌, మ‌హేంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





శివ‌కుమార్ మురుగేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీకి `సియోన్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. సోమ‌వారం ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 17) ఉద‌యం 10 గంట‌ల‌కు చెన్నైలో `సియోన్‌సెల‌బ్రేష‌న్స్‌` పేరుతో నిర్వ‌హించ‌నున్న ప్ర‌త్యేక ఈవెంట్‌లో ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని కీల‌క అప్‌డేట్‌ల‌ని రివీల్ చేయ‌బోతున్నారు. శివ కార్తికేయ‌న్‌, రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ కాంబినేష‌న్‌లో 2024లో విడుద‌లైన `అమ‌ర‌న్‌` పాన్ ఇండియా వైడ్‌గా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

బాక్సాపీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంచ‌ల‌న విజ‌యం త‌రువాత హిట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `సియోన్‌` కావ‌డంతో దీనిపై అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. స‌రికొత్త పాయింట్‌లో రూర‌ల్ విలేజ్ స్టోరీగా దీన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఫాంట‌సీ ఎలిమెంట్స్‌కు స్పిరిల్యువ‌ల్ అంశాల‌ని జోడించి ఓ రూటెడ్ స్టోరీని అందించ‌బోతున్నారు. ఇందులో శివ‌కార్తికేయ‌న్ మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి ఆక‌ట్టుకోబోతున్నాడు.

`వీరం ఉండు వెట్రి ఉండు` అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. పురివిప్పిన నెమ‌లి వెనుక భాగంలో ఉండ‌గా ముందు క‌త్తిప‌ట్టుకుని, మెడ‌లో క‌రుంగ‌లి మాల ధ‌రించి, అడ్డ‌బొట్టుతో శివ‌కార్తికేయ‌న్ క‌నిపిస్తుండ‌గా చుట్టూ నెమ‌లులు క‌నిపిస్తున్న‌ తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో శివ‌కార్తికేయ‌న్ కుమార‌స్వామి భ‌క్తుడిగా మురుగ‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్నాడు. బ్యాక్ టు బ్యాక్ డిఫ‌రెంట్ మూవీస్‌, స్టోరీస్‌తో ఆక‌ట్టుకుంటున్న శివ కార్తికేయ‌న్ ఈ సినిమాతో త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇస్తాడో తెలియాలంటే మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.