Begin typing your search above and press return to search.

మదరాసి సెలవిక సాంగ్‌: లవ్ ఫెయిల్యూర్ లో శివకార్తికేయన్ హై వైబ్

ఇటీవలే ‘అమరన్’తో మంచి హిట్ సాధించిన శివకార్తికేయన్ ఇప్పుడు మదరాసి అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By:  M Prashanth   |   1 Aug 2025 12:50 PM IST
మదరాసి సెలవిక సాంగ్‌: లవ్ ఫెయిల్యూర్ లో శివకార్తికేయన్ హై వైబ్
X

ఇటీవలే ‘అమరన్’తో మంచి హిట్ సాధించిన శివకార్తికేయన్ ఇప్పుడు మదరాసి అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ముందు పెద్దగా హైప్ లేకపోయినా, తాజాగా విడుదలైన మొదటి సింగిల్ ‘సెలవిక’తో మాత్రం ట్రెండ్ మారిపోయింది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు మదరాసి సిద్ధమవుతోంది.


‘సెలవిక’ అంటూ వచ్చేసిన ఈ పాటకు సంగీతాన్ని అందించినది అనిరుధ్ రవిచందర్. యంగ్ సింగర్ ధనుంజయ ఈ పాటను ఆలపించాడు. శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించారు. లిరికల్ వీడియో విడుదలైన గంటల్లోనే యూట్యూబ్‌లో హిట్ అయ్యింది. పాటలో వినిపించిన ఫ్రెష్ బ్రేకప్ ఎమోషన్, సంగీతంలోని బలం, లిరిక్స్‌లోని ట్రెండీ టచ్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే అంటే, ఈ పాటలోని శివకార్తికేయన్ డాన్స్ మూమెంట్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అనిరుధ్ బాణీలు ఎప్పటిలానే క్లాస్‌గా ఉంటే, SK స్టెప్పులతో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పాట ఎంత బాగుందనే దానికంటే శివకార్తికేయన్ ఎనర్జీ డాన్స్ ఫోజులు మరింత హైలైట్ అవుతున్నాయి.

సాంగ్ మాస్ యాక్షన్ మిక్స్‌తో ఆకట్టుకుంటోంది, SK పెర్ఫార్మెన్స్ అన్నింటికన్నా హై లెవెల్.. అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పాటలోని మెలోడీ, వర్డ్ ప్లే, సింగర్ వాయిస్‌కు ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా బ్రేకప్ సాంగ్‌లను మాస్ ఎమోషన్‌తో మిక్స్ చేసి అనిరుధ్ సంగీతం అందించడం వల్ల యువతకు ఇది కొత్త అనుభూతి ఇచ్చింది.

ఇక ఈ సినిమాకు మొదట్లో పెద్దగా హైప్ లేకపోయినా, పాటతో ప్రమోషన్స్‌లో కొత్త ఊపునిచ్చింది. ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ గత చిత్రం ‘సికిందర్’ ఫెయిల్ అయిన తర్వాత, ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరగడం విశేషం. కానీ SK అనిరుధ్ మ్యూజికల్ టచ్‌తో ‘మదరాసి’ మళ్లీ యూత్ ఆడియన్స్‌లో ఆసక్తిని రేపుతోంది. ట్రెండ్, సోషల్ మీడియా హైప్ చూస్తుంటే ఈ సారి SK చేతిలో మరో హిట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 5న థియేటర్లలో మదరాసి సందడి ఎలా ఉంటుందో చూడాలి.