Begin typing your search above and press return to search.

శివ కార్తికేయన్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది నటీనటులు.. అలా కాబోయి ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము అని చెబుతూ ఉంటారు.

By:  Madhu Reddy   |   1 Sept 2025 11:15 AM IST
శివ కార్తికేయన్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారో తెలుసా?
X

సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాలామంది నటీనటులు.. అలా కాబోయి ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అందులో కొంతమంది తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి డబ్బు కోసం సినిమాలలోకి వచ్చామని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. మరి కొంతమంది డాక్టర్ , ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్లు కూడా సినిమా రంగంపై ఫ్యాషన్ తో వాటన్నింటినీ పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. మరి కొంతమంది తల్లిదండ్రుల కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. మరికొంతమంది ఫ్యాషన్ తో ఈ రంగంలోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే అలా వచ్చినవాళ్లు ఏదో ఒక సందర్భంలో తాము హీరో, హీరోయిన్ కాకపోయి ఉండి ఉంటే.. ఫలానా ఉద్యోగంలో స్థిరపడే వాళ్ళమని చెప్పుకొస్తున్నారు కూడా.. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్ కూడా తాను హీరోగా అవతరించక ఉండుంటే.. ఏమయ్యేవారో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

మదరాసి ఈవెంట్లో తన డ్రీమ్ బయటపెట్టిన శివ కార్తికేయన్..

అసలు విషయంలోకి వెళ్తే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రం మదరాసి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రముఖ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అందులో భాగంగానే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న శివ కార్తికేయన్.. హీరో కాకపోయి ఉండుంటే ఏమయ్యేవారో కూడా తెలిపారు.

నాన్నే మార్గదర్శకం..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. " నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్. నేను ఆయనను మించి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను. మా నాన్న నాకు మార్గదర్శకం.. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. ఒకవేళ ఇటువైపు రాకపోయి ఉంటే కచ్చితంగా ఐపీఎస్ ట్రై చేసే వాడిని " అంటూ తన కలను బయటపెట్టారు శివ కార్తికేయన్. మొత్తానికైతే శివ కార్తికేయన్ ఐపీఎస్ కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

విజయ్ పై ఊహించని కామెంట్స్ చేసిన శివ కార్తికేయన్.

ఇకపోతే కోలీవుడ్లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న శివ కార్తికేయన్ కి ఈమధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారిన ఈయన.. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో స్టార్ హీరోగా మారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన గుర్తింపును చూసి చాలామంది విజయ్ దళపతి రేంజ్ కు ఎదుగుతారని అందరూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై కూడా ఈయన మాట్లాడుతూ.. "విజయ్ ను నేను అన్నగా భావిస్తాను. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే .. అన్నయ్య ఎప్పుడూ అన్నయ్యే" అంటూ విజయ్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలను డైరెక్ట్ చేసిన మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఇప్పుడు మరింత గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.