టాలెంటెడ్ హీరో కష్టమంతా వృధానే
అమరన్ సినిమాతో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్.
By: Sravani Lakshmi Srungarapu | 13 Jan 2026 7:00 PM ISTఅమరన్ సినిమాతో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్. ఆ సినిమా సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ ఇప్పటివరకు మరో హిట్ ను అందుకోలేదు. అమరన్ సినిమాతో అందుకున్న సక్సెస్ ను శివ కార్తికేయన్ కంటిన్యూ చేస్తారనుకుంటే అతన్నుంచి వచ్చిన తర్వాతి సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫలితాలను అందుకుని నిరాశ పరుస్తున్నాయి.
మదరాసితో ఫ్లాపు అందుకున్న శివ కార్తికేయన్
ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి సినిమా చేస్తే ఆ సినిమా దారుణంగా ఫెయిలైంది. కోలీవుడ్ లో ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో అసలేమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా పరాశక్తి అనే సినిమా వచ్చింది. మదరాసి మిగిల్చిన నిరాశను ఈ సినిమా తీరుస్తుందని శివ కార్తికేయన్ చాలా ఆశపడ్డారు.
పరాశక్తికి నెగిటివ్ టాక్
కానీ పరాశక్తి కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. వాస్తవానికి ఈ సినిమా విజయ్ మూవీ జన నాయగన్ తో రిలీజవాలి. కానీ విజయ్ సినిమా వాయిదా పడటంతో పరాశక్తికి ఫ్రీ గ్రౌండ్ దొరికింది కలెక్షన్ల వర్షం గ్యారెంటీ అని అనుకున్నారు కానీ అది జరగలేదు. మొదటి షో నుంచే పరాశక్తికి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈవెనింగ్ కు అది కాస్తా నెగిటివ్ గా మారింది.
కలెక్షన్లు నానాటికీ బాగా డ్రాప్ అవుతున్నాయి. ఇదే మంచి ఛాన్స్ అని భావించిన కొన్ని సినిమాలు ఇప్పుడు సడెన్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో పరాశక్తి టీమ్ మరింత కంగారు పడుతుంది. డైరెక్టర్ సుధా కొంగరపై ఉన్న నమ్మకంతో శివ కార్తికేయన్ చేసిన ఈ అటెంప్ట్ అతనికే కాకుండా ఆ సినిమాలో నటించిన అందరికీ చేదు అనుభవాన్నే మిగిల్చింది. కేవలం డైరెక్టర్ పై నమ్మకంతో రవి మోహన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తే, కోలీవుడ్ డెబ్యూ కోసం ఎంతో కాలం వెయిట్ చేసి శ్రీలీల పరాశక్తితో లాంచ్ అయ్యారు. ఇక హీరో శివ కార్తికేయన్ ఈ సినిమా కోసం పడిన కష్టమైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కూడా ఎక్కువ నష్టాల్నే మిగల్చనుందని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఏదేమైనా శివ కార్తికేయన్ కు మరో ఫ్లాపు తప్పలేదు.
