కోలీవుడ్ టాలెంటెడ్ హీరో మళ్లీ ఆ రిస్క్ చేస్తాడా?
ఎవరైనా సరే జీవితంలో ఒకసారి రాంగ్ స్టెప్ వేస్తే మరోసారి అటు వైపు వెళ్లే సాహసం చేయరు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Sept 2025 11:26 AM ISTఎవరైనా సరే జీవితంలో ఒకసారి రాంగ్ స్టెప్ వేస్తే మరోసారి అటు వైపు వెళ్లే సాహసం చేయరు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం నడిచిన దారి బాలేదని తెలిసినా మరోసారి అదే దారిలో వెళ్లడానికి రెడీ అవుతుంటారు. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు అదే చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అమరన్ తర్వాత మురుగదాస్ తో సినిమా
గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శివ కార్తికేయన్ రీసెంట్ గా మదరాసి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మదరాసి సినిమాకు తమిళంలో మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ, మిగిలిన భాషల్లో మాత్రం అనుకున్న రిజల్ట్స్ రాలేదు.
మురుగదాస్ తో శివ కార్తికేయన్ మరో మూవీ?
ఒక్క మాటలో చెప్పాలంటే అమరన్ తర్వాత శివ కార్తికేయన్ చేయాల్సిన సినిమా కాదు మదరాసి. కానీ శివ కార్తికేయన్.. కథ మీద, మురగదాస్ మీద నమ్మకముంచి మదరాసి చేశారు. శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో పరాశక్తి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త తెగ వినిపిస్తోంది.
డైరెక్టర్ మురుగదాస్ తో శివ కార్తికేయన్ మరో సినిమా చేయడానికి చేతులు కలిపే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. మదరాసి సినిమా షూటింగ్ టైమ్ లో మురుగదాస్, శివకార్తికేయన్ కు ఓ కథ చెప్పారని, ఆ కథకు హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించారని అంటున్నారు. అయితే శివ కార్తికేయన్ ఆ టైమ్ లో మురుగదాస్ చెప్పిన కథపై ఆసక్తి చూపించారు కానీ, మదరాసి ఫలితం చూశాక కూడా తను అదే డెసిషన్ తో ముందుకెళ్లి రిస్క్ చేస్తారా? ఒకవేళ మరోసారి కూడా మురుగదాస్ తో సినిమా చేసే రిస్క్ చేస్తే ఫ్యాన్స్ దానికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
