కోలీవుడ్ టాలెంటెడ్ హీరోని గట్టెక్కించేదెవరు?
కానీ ఆశ్చర్యంగా ఈ సినిమా బుకింగ్స్ లో ఏ మాత్రం హడావిడి కనిపించడం లేదు. ఓ వైపు ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నా ఆడియన్స్ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 6:00 AM ISTఒక హీరోకైనా, డైరెక్టర్ కు అయినా పెద్ద బ్లాక్ బస్టర్ దక్కిన తర్వాత వారు చేసే నెక్ట్స్ సినిమాకు విపరీతమైన హైప్ రావడం సహజం. కానీ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతుంది. శివ కార్తికేయన్ హీరోగా కోలీవుడ్ కల్డ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మదరాసికి ఉపయోగపడని అమరన్ హిట్
ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ ఏ ఏరియాలోనూ మదరాసికి బుకింగ్స్ ఊహించిన రీతిలో లేవు. శివ కార్తికేయన్ నుంచి ఆఖరిగా వచ్చిన అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఈ సినిమాకు ఆ హిట్ ఏమాత్రం ఊపయోగపడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మామూలుగా అయితే అమరన్ సినిమా తర్వాత శివ కార్తికేయన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటూ ఆయన క్రేజ్, మార్కెట్ ను బట్టి చూస్తే ఈ పాటికే మదరాసి బుకింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో జరిగి ఉండాల్సింది.
అంతా మురుగదాస్ వల్లే..
కానీ ఆశ్చర్యంగా ఈ సినిమా బుకింగ్స్ లో ఏ మాత్రం హడావిడి కనిపించడం లేదు. ఓ వైపు ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నా ఆడియన్స్ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ మురుగదాస్. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేసిన ఆయన గత కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్నారు. మొన్నీ మధ్య సల్మాన్ ఖాన్ తో సికందర్ చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. అయితే సికందర్ ఫ్లాపుకు కారణం తాను కాదని చెప్పడానికి చాలా ట్రై చేసినప్పటికీ అదేమీ పెద్దగా వర్కవుట్ అవలేదు.
వర్కవుట్ అవని అనిరుధ్ మ్యాజిక్
దానికి తోడు మొన్నీమధ్య మురుగదాస్ తమిళ డైరెక్టర్లు కేవలం జ్ఞానం ఇవ్వడానికే సినిమాలు తీస్తారని, అందుకే వెయ్యి కోట్ గ్రాసర్ మా దగ్గర లేవని కామెంట్ చేయడం వేరే భాషల సినీ ప్రియులను కూడా కోపానికి గురయ్యేలా చేసింది. పైగా అన్ని సినిమాలకు బ్రాండ్ గా నిలిచే అనిరుధ్ మ్యూజిక్ కూడా మదరాసికి పెద్దగా వర్కవుట్ అవడం లేదు. ఇక రుక్మిణి వసంత్ సినిమాను ప్రమోట్ అయితే చేస్తుంది కానీ వావ్ అనే రేంజ్ లో ఏమీ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో శివ కార్తికేయన్ ను సినిమాలోని కంటెంటే ఆదుకోవాలి. సినిమా రిలీజయ్యాక మంచి టాక్ వస్తే తప్పించి మదరాసి సక్సెస్ దిశగా అడుగులేసే అవకాశాలు కనిపించడం లేదు.
