Begin typing your search above and press return to search.

అందుకే తెలుగు సినిమాలు 1000 కోట్లు రాబడుతున్నాయి

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   1 Sept 2025 10:01 AM IST
అందుకే తెలుగు సినిమాలు 1000 కోట్లు రాబడుతున్నాయి
X

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు వినూత్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం 'మదరాసి'. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఆర్. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.

మదరాసి సినిమాతో రానున్న శివ కార్తికేయన్..

సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మాస్ వయలెన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా శివ కార్తికేయను ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో చూడబోతున్నామని అభిమానులు కూడా చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

అందుకే తెలుగు సినిమాలకు 1000 కోట్లు వస్తున్నాయి..

ఈ ఈవెంట్లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలు రూ.1000 కోట్లు రాబట్టడం వెనుక అసలు రహస్యాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలోనే శివ కార్తికేయన్ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ పై మొదటి ప్రశంసలు కురిపించారు . "తెలుగు సినిమాలు రూ.1000 కోట్లు వసూలు చేయడానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రేక్షకులు సినిమాను ప్రేమించడమే.. హీరోలను విపరీతంగా అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తెలుగు సినిమాలు కూడా ఈజీగా రూ.1000 కోట్లు రాబడుతున్నాయి. అలాగే నా సినిమాని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ శివ కార్తికేయన్ తెలిపారు.మొత్తానికైతే టాలీవుడ్ సినీ పరిశ్రమపై టాలీవుడ్ ప్రేక్షకులపై శివ కార్తికేయన్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక్కడి వారు చూపించే ప్రేమాభిమానాలే సినిమాలకు అత్యధిక కలెక్షన్లు రావడానికి కారణమని తెలిపారు శివ కార్తికేయన్.

శివ కార్తికేయన్ కెరియర్..

శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. విజయ్ టీవీలో తొలుత వ్యాఖ్యాతగా కెరియర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడు పాండియరాజన్ దర్శకత్వం వహించిన 'మెరీనా' సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి హీరోగా పరిచయమయ్యారు. తమిళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన .. మొదటిసారి 'రెమో' చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసి.. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. ఇక తర్వాత వరుణ్ డాక్టర్, డాన్ అంటూ పలు చిత్రాలు తమిళ్లో చేస్తూనే వాటిని తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు

అమరన్ సినిమాతో భారీ గుర్తింపు..

చివరిగా అమరన్ సినిమాతో ఊహించని పాపులారిటీ సంపాదించుకున్నారు. ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు. 2018 లో వచ్చిన కన అనే సినిమాతో నిర్మాతగా మారి సత్తా చాటారు.