ఆ నిర్మాతను ఆదుకోవాల్సింది అన్నదమ్ములే!
అడిగినా జ్ఞాన్ వేల్ రాజా స్పందించడం లేదని ఆరోపించాడు. దీనికి సంబంధించి వ్యవహారం కోర్టు ఫరిధిలో ఉంది.
By: Srikanth Kontham | 25 Dec 2025 8:00 AM ISTతమిళ చిత్రాల నిర్మాత కె.ఇ జ్ఞాన్ వేల్ రాజా అప్పుల చిట్టా బయట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు `వా వాతయార్` సినిమా రిలీజ్ చేయాలంటే? పాత బకాయిలు చెల్లిస్తే తప్ప సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈవివాదం కోర్టులో ఉంది. పాత అప్పు తీరితే తప్ప రిలీజ్ కు కోర్టు క్లియరెన్స్ ఇచ్చేలా కనిపిం చలేదు. ఓటీటీ డీల్ కుదుర్చుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా చేసుకున్న ఒప్పం దాన్ని రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే జరిగితే జ్ఞాన్ వేల్ రాజా మరింత భారాన్ని మోయాల్సి ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ పై క్లారిటీ వస్తే గానీ మరే ఓటీటీ సంస్థ కూడా డీల్ కోసం ముందుకు రాదు.
అసలే ఓటీటీలు కంటెంట్ చూసి కొనుగోలు చేస్తున్నాయి. ఏమాత్రం సందేహం ఉన్నా? కొనడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా తక్కువ మొత్తంలో ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పుండు మీద కారం చల్లినట్లు శివ కార్తికేయన్ సరిగ్గా ఇదే సమయంలో తనకు చెల్లించాల్సిన పారితోషికం చెల్లించలేదని కోర్టును ఆశ్ర యించాడు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన `మిస్టర్ లోకల్` సినిమాకు సంబంధించి జరిగిన ఆర్దిక వివాదం తె రపైకి వచ్చింది. 15 కోట్లలో తనకు చెల్లించాల్సిన మరో నాలుగు కోట్టు చెల్లించకుండా తిరుగుతున్నాడు ? అన్నది శివకార్తికేయన్ ఆరోపణ.
అడిగినా జ్ఞాన్ వేల్ రాజా స్పందించడం లేదని ఆరోపించాడు. దీనికి సంబంధించి వ్యవహారం కోర్టు ఫరిధిలో ఉంది.జ్ఞాన్ వేల్ రాజా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఆయన నిర్మించిన గత సినిమాలు భారీ నష్టాలు తేవడంతోనే. ఇప్పుడీ పరిస్థితి నుంచి రాజా బయట పడే మార్గాలు అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో జ్ఞాన్ వేల్ రాజాను ఆదుకో వాల్సింది అన్నదమ్ములేనంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. జ్ఞాన్ వేల్ రాజా ఎక్కువగా సినిమాలు నిర్మించింది సూర్య-కార్తీలతోనే. ఎలాంటి ప్రయోగాలైనా? రాజా వారిద్దరితోనే చేస్తారు అనే ఇమేజ్ అతడిపై ఉంది.
స్టూడియో గ్రీన్ సంస్థ నుంచి కూడా అన్నదమ్ములిద్దరు సొంత సంస్థలా భావించి పనిచేస్తారు. ఆ సంస్థ తో కొన్నేళ్లగా అనుబంధం కొనసాగుతుంది. అయితే ఇంతకాలం ఓ ర్యాపో..ప్రెండ్ షిప్ కారణంగా ఈ బాండింగ్ కొనసాగు తుందను కున్నారంతా. కానీ విషయం ఏంటంటే? అన్నదమ్ములిద్దరికీ జ్ఞాన్ వేల్ రాజా బంధువు అని కూడా తెలిసింది. రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం కూడా ఉందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నద మ్ములిద్దరు తలుచు కుంటే జ్ఞాన్ వేల్ రాజా పైనాన్స్ ఇష్యూ క్లియర్ అవ్వడం పెద్ద విషయం కాదు.
గతంలో ప్రభు కూడా అప్పుల ఊబుల్లో కూరుకుపోయిన సమయంలో స్నేహితుడైన సూపర్ స్టార్ రజనీకాంత్ అతడి సంస్థలోనే ఓ సినిమా (చంద్రముఖి) చేసి హిట్ ఇవ్వడంతో? అప్పులన్నీ క్లియర్ అవ్వగా లాభాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సూర్య-కార్తీలు సంయుక్తంగా అలాంటి ఆలోచన చేయగలిగితే? రాజా ఆర్దిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.
