Begin typing your search above and press return to search.

హిట్ బ్యానర్ సెంటిమెంట్… శివకార్తికేయన్ కోసం కమల్ హాసన్ మరో పెద్ద రిస్క్!

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయింది.

By:  Madhu Reddy   |   20 May 2026 1:04 PM IST
హిట్ బ్యానర్ సెంటిమెంట్… శివకార్తికేయన్ కోసం కమల్ హాసన్ మరో పెద్ద రిస్క్!
X

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయింది. గతంలో వీరి జోడీలో వచ్చిన ఆమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి ఘన విజయంగా నిలిచింది. ఇప్పుడు అదే ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌లో శివకార్తికేయన్ హీరోగా ‘సేయోన్’ అనే కొత్త సినిమా రాబోతోంది. వరసగా కొన్ని ఫ్లాప్‌లు వచ్చినా, శివకార్తికేయన్ మార్కెట్ స్టామినాని నమ్మి కమల్ హాసన్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం

అమరన్ సెంటిమెంట్.. కమల్ హాసన్ గట్టి నమ్మకం:

కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో శివకార్తికేయన్ చేసిన ‘ఆమరన్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా శివకార్తికేయన్ కెరీర్‌నే మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన మద్రాసి, పరాశక్తి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. కమల్ హాసన్ మాత్రం శివకార్తికేయన్‌ను అస్సలు వదల్లేదు. ఇక ఆయనపై ఉన్న నమ్మకంతో మళ్లీ ‘సేయోన్’ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ హిట్ బ్యానర్ సెంటిమెంట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.

నెక్స్ట్ సూపర్ స్టార్ రేస్‌లో శివకార్తికేయన్:

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ రేసింగ్‌పై ఫోకస్ పెట్టడం, రజనీ-కమల్ సినిమాలను తగ్గిస్తుండటంతో.. ‘నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?’ అనే చర్చ మొదలైంది. ఇక శివకార్తికేయన్‌కు మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. కాబట్టి కోలీవుడ్ నెక్స్ట్ నంబర్ వన్ సింహాసనాన్ని అందుకోవడానికి శివకార్తికేయన్‌కు ఈ ‘సేయోన్’ సినిమా ఒక పెద్ద అస్త్రం లాంటిదని చెప్పొచ్చు.

డైరెక్టర్‌కు ఇది పెద్ద పరీక్ష:

ఈ సినిమాకు శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తన మొదటి సినిమా 'తాయ్ కిళవి'తో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే, మొదటి సినిమా హిట్ అయ్యాక, సెకండ్ సినిమాను శివకార్తికేయన్ లాంటి పెద్ద మాస్ హీరోతో చేసేటప్పుడు డైరెక్టర్‌పై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

అక్టోబర్ 2026 రిలీజ్.. పక్కా ప్లానింగ్:

ఈ సినిమాను అక్టోబర్ 2026 లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇప్పుడే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అక్టోబర్ అంటే సౌత్‌లో ఆయుధ పూజ, దీపావళి లాంటి పెద్ద పండుగల సీజన్ ఉంటుంది. శివకార్తికేయన్ సినిమాలకు ఫ్యామిలీస్, పిల్లలు ఎక్కువగా వస్తారు కాబట్టి, ఆ లాంగ్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడే పక్కా ప్లాన్ వేశారు. ఇక ఈ ప్లానింగ్ గనక వర్కవుట్ అయితే ఓపెనింగ్స్ పరంగానే సగం విజయం ఖాయం.

మొత్తానికి కమల్ హాసన్ నమ్మకం, శివకార్తికేయన్ మాస్ ఇమేజ్ కలిసి ‘సేయోన్’ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఫ్లాప్స్ వచ్చినా వెనకాడకుండా కమల్ హాసన్ తీసుకున్న ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మరి ఈ క్రేజీ కాంబో ‘అమరన్’ లాంటి హిట్‌ను రిపీట్ చేసి, శివకార్తికేయన్‌ను కోలీవుడ్ రేస్‌లో ముందు నిలబెడుతుందో లేదో తెలియాలంటే ఈ అక్టోబర్ వరకు అగలిసిందే..