తమిళ క్రేజీ హీరో టాలెంట్ మైండ్ బ్లోయింగ్ అంతే!
కానీ కొంత మంది మాత్రమే ఆల్ రౌండ్ ప్రతిభని ప్రదర్శిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
By: Tupaki Entertainment Desk | 4 Feb 2026 3:00 PM ISTవెండితెరపై మెరుపులు మెరిపిస్తూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథానాయకులు సినిమాల్లో తమదైన మార్కు డ్యాన్స్‌లతో, ఫైట్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటూ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపుని దక్కించుకుంటుంటారు. అంతే కాకుండా తెర వెనుక కూడా తమ సత్తాని చాలుకుంటుంటారు. కొంత మంది స్క్రీప్ట్‌లో భాగం అవుతుంటారు. మరి కొంత మంది స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తుంటారు. కొంత మంది పాటలు రాస్తుంటారు. కొంత మంది పవన్‌లా ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు.
కానీ కొంత మంది మాత్రమే ఆల్ రౌండ్ ప్రతిభని ప్రదర్శిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి క్రేజీ టాలెంట్ ఉన్న ఏకైక హీరో శివ కార్తికేయన్. కాలేజీ రోజుల్లో మిమిక్రీ చేస్తూ సహ స్టూడెంట్స్‌ని అలరించిన శివ కార్తికేయన్ అదే స్ఫూర్తితో స్టాండప్ కామెడీ షో `కళక్కుపూవతి యారు?`లోకి ప్రవేశించి విజేతగా నిలిచాడు. ఆ తరువాత `అదు ఇదు ఏదు` రియాలిటీ షోతో హోస్ట్‌గా అవతారం ఎత్తి బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తన హోస్టింగ్ స్టైల్ నచ్చి అజిత్ నటించిన `ఏగన్` (2008)లో ఓ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్.
శివ కార్తికేయన్ బ్యాడ్ లక్.. ఎడిటింగ్‌లో తన క్యారెక్టర్‌ని మొత్తానికే లేపేశారట. 2011లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్టర్‌గా ట్రైల్స్ వేస్తూ చేసిన `ముగపుతగం` షార్ట్ ఫిల్మ్‌తో నటుడిగా కెమెరా ముందుకొచ్చాడు. ముందు దీన్ని మూవీగా చేయాలని ప్లాన్ చేశారు. దీని కోసం హేమా హేమీ టెక్నీషియన్స్ జార్జ్ సి.విలియమ్స్‌ని కెమెరామెన్‌గా, టీ.ఎస్. సురేష్‌ని ఎడిటర్‌గా, విశాల్ చంద్రశేఖర్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. కానీ ఫైనల్ వెర్షన్‌కు వచ్చేసరికి దీన్ని ఓ షార్ట్ ఫిల్మ్ కింద మార్చేశారు. ఇది శివకార్తికేయన్‌కు మంచి పేరు తీసుకురావడంతో 2012లో `మెరీనా` సినిమాతో హీరోగా అరంగేట్రం చేయడం, అది సక్సెస్ కావడం తెలిసిందే.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా స్టిండప్ కామెడీ షో నుంచి శివకార్తికేయన్ ప్రయాణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఎదిగే వరకు చేరడం విశేషం. 14 ఏళ్ల సినీ ప్రయాణంలో శివకార్తికేయన్ చేయని పని లేదు. టచ్ చేయని క్రాఫ్ట్ లేదంటే అతిశయోక్తి కలగకమానదు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శివ కార్తికేయన్ ప్లే బ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, కొన్ని క్రేజీ సినిమాలకు, స్టార్ హీరోల మూవీస్‌కి పాటల రచయితగా కూడా వర్క్ చేయడం విశేషం. `వరుతపడాత వాలిబర్ సంఘం` మూవీ నుంచి నిన్నటి `పరాశక్తి` మూవీ వరకు మొత్తం 13 సినిమాలకు పాటలు పాడాడు.
ఇక గేయ రచయితగా `కొలమావు కోకిల` నుంచి `అయలాన్` వరకు మొత్తం పది సినిమాలకు పది పాటలు అందించాడు. ఇందులో దళపతి విజయ్‌నటించిన `బీస్ట్` మూవీ కోసం రాసిన `అరబికూతు అలమతి హబీబో` తమిళ, తెలుగు భాషల్లో ఏ స్థాయిలో వైరల్ అయిందో తెలిసిందే. ఇలా 14 ఏళ్ల సినీ ప్రయాణంలో శివ కార్తికేయన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హోస్ట్‌గా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, లిరిసిస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా..ఇలా అన్ని రంగాల్లోనూ తన బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించి వావ్ అనిపించుకోవడం విశేషం.
