సగం సైకాలాజికల్ గా..మరో సగం చుట్టాలు చంపేస్తారు!
సీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా చాలా సినిమాలు చేసారు.
By: Srikanth Kontham | 16 Aug 2025 4:00 PM ISTసీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా చాలా సినిమాలు చేసారు. హాస్య భరత పాత్రలతోనూ ప్రేక్షకుల్ని అలరించిన నటుడు. కొత్త నటుల ఎంట్రీతో అవకాశాలు తగ్గినా? ఇప్పటికీ స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరి స్తున్నారు. అందించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గత ఏడాది 'ఉషా పరిణయం' చిత్రంలో నటించారు. ఇదే ఏడాది `హత్య`, `ఒక బృందావనం` చిత్రాల్లోనటించారు.
అదృష్టంగా భావిస్తున్నా:
అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్షుడిగానూ కొంత కాలం పాటు సేవలందించారు. సహాయక కార్యక్రమాలు చేయడం లోనూ శివాజీ ముందుంటాడని ఎన్నో సందర్భాల్లో రుజువు చేసారు. తాజాగా శివాజీ నిత్య జీవితంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు..బంధాలు..బంధుత్వాలు ఎలా ఉంటాయి? అన్నది తన వెర్షన్లో చెప్పే ప్రయత్నం చేసారు. `సీనియర్ ఆర్టిస్టులో రంగనాధ్ గారంటే అభిమానం. గొప్ప నటుడే కాదు..అంతకు మించి కవి కూడా. అతని దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
భార్యని ఆయనలా ఎవరూ చూడలేరు:
ఆయన ఉన్న రోజుల్లో ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. చుట్టూ ఉన్న వారిలో కూడా మంచి కోసం తపన పడేవారన్నారు. ఆయన్ని చాలా దగ్గరగా చూసాను. ఆయన పడిన కష్టాలు చూసాను. అనారోగ్యంతో ఉన్న భార్యను ఎంతో బాగా చూసుకున్నారు. ఆయన్ని చూసిన తర్వాత భార్యని ఎవరు అంత గొప్పగా చూడలేరేమో! అనిపించింది. కొన్ని రకాల పరిస్థితులు ఆయన్ని ఆర్దిక ఇబ్బందుల్లో పడేసాయన్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని మధ్యలో ముగించకూడదని చెప్పేవారు. ఎన్ని కష్టాలొచ్చిన తట్టుకుని నిలబడా లనేవారు.
ప్రమాదకరమైన సోసైటీలో జీవనం:
అలాంటి వ్యక్తి ఆ వసులో ఆత్మ హత్య చేసుకోవడం ఎవరూ ఊహించి ఉండరు. అందుకే ఆయన సూసైడ్ చేసుకున్న సమస్యంలో అంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆర్దికంగా బలంగా లేకపోతే సైకాలాజికల్ సగం చచ్చిపోతారు. మిగతా సగం చుట్టాలు...చుట్టు పక్కల...స్నేహితులు ఉండేవారు చంపేస్తారు. ఎదుట వారి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే సోసైటీ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కో వాల్సి ఉంటుందన్నారు.
