అన్న ఎప్పుడూ అన్నే తమ్ముడు తమ్ముడే!
దళపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ చివరి సినిమాగా `జన నాయగన్ `తెరకెక్కుతుంది
By: Srikanth Kontham | 25 Aug 2025 8:26 PM ISTదళపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ చివరి సినిమాగా `జన నాయగన్ `తెరకెక్కుతుంది. ఇది రిలీజ్ అయిన అనంతరం విజయ్ రాజకీయాల్లోనే బిజీ అవుతారు. ఇప్పటికే పార్టీని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2026 ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో విజయ్ రాజకీయాల్ని ఇకపై ఇంకెత సీరియస్ గా తీసుకుంటారు? అన్నది క్లారిటీ వచ్చేసింది.
అయితే విజయ్ ఇండస్ట్రీని వదిలేస్తే ఆయన స్థానాన్ని మరే నటుడు భర్తీ చేస్తాడు? ప్యూచర్ దళపతి ఎవరు? అన్న దానిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. దీనిలో భాగంగా కుట్టీ దళపతి, ప్యూచర్ దళపతి, నెక్స్ట్ దళపతి ఇలా కొన్ని ట్యాగ్స్ పై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆ ఛాన్స్ శివ కార్తికేయన్ కు కూడా ఉందని ప్రచారం షురూ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా శివ కార్తికేయన్ ఈ ప్రచారంపై స్పందించారు. అన్న ఎప్పుడూ అన్నే అంటూ విజయ్ ని తాను అన్నయ్యగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
విజయ్ అభిమానులను తాను ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్నారు అన్న ప్రచారాన్ని ఖండించారు. ఏ నటుడు మరో నటుడి అభిమానుల్ని గెలవలేరన్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎవరికి వారు సొంతంగా సంపాదించుకునేది నటుల్ని ..అలాంటి నటుల్ని మరో హీరో ఎలా సొంతం చేసుకుంటారని ఎదురు ప్రశ్నించారు. తాను ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉంటున్నానని, తనకు తాను కొందరు అభిమానుల్ని తాను సంపాదించుకున్నానన్నారు. తన జీవితానికి ఇది చాలన్నారు.
సచిన్ టెండూల్కర్, ధోనీలను లాంటి వాళ్లను కొందరు విమర్శిస్తారని, వారిపై వచ్చే ట్రోల్స్ ను పట్టించు కోవాల్సిన పనిలేదన్నారు. అలాంటి వాటిని చూసి ఎంత మాత్రం ఆవేశ పడొద్దని అభిమానులకు సూచిం చారు. ఈ సందర్భంగా విజయ్ ని తానెంతగా అభిమానిస్తున్నాడు? అన్న విషయం బయట పడటం విశే షం. ఇంత వరకూ విజయ్ పై అబిమానాన్ని శివ కార్తికేయన్ ఏ వేదికపైనా చాటుకోలేదు. తొలిసారి తనని విజయ్ తో పోల్చడంతో తన దృష్టిలో విజయ్ స్థానం బయట పడింది.
