Begin typing your search above and press return to search.

పరాశక్తితో రిస్క్ చేస్తున్నాడు..?

శివ కార్తికేయన్ సుధ కొంగర కాంబినేషన్ లో వస్తున్న పరాశక్తి రిలీజ్ పై కొంత కన్ ఫ్యూజన్ ఏర్పడింది.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 5:00 PM IST
పరాశక్తితో రిస్క్ చేస్తున్నాడు..?
X

శివ కార్తికేయన్ సుధ కొంగర కాంబినేషన్ లో వస్తున్న పరాశక్తి రిలీజ్ పై కొంత కన్ ఫ్యూజన్ ఏర్పడింది. సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ కి పోటీ ఎందుకన్నట్టు ఆలోచించారట. కానీ లేటెస్ట్ గా శివ కార్తికేయన్ పరాశక్తి అఫీషియల్ రిలీజ్ పోస్టర్స్ వచ్చాయి. జనవరి 14న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రవి మోహన్, అధర్వ, బసిల్ జోసెఫ్ కూడా నటిస్తున్నారు.

విజయ్ కి పోటీగా పరాశక్తి..

పరాశక్తి సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఐతే పరాశక్తి సినిమా రిలీజ్ రిస్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దళపతి విజయ్ కి చివరి సినిమాపై ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. విజయ్ కి పోటీ ఎందుకనే ఉద్దేశ్యంతోనే సూర్య కరుప్పు, విక్రం హీరోగా వస్తున్న ఒక సినిమా రిలీజ్ ని సమ్మర్ కి షిఫ్ట్ చేశారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం పోటీలో ఉండి తీరుతా అంటున్నాడు.

ఐతే శివ కార్తికేయన్ కి విజయ్ సినిమాతో పోటీ మాత్రమే కాదు మదరాసి ఫెయిల్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. మరి విజయ్ తో ఫైట్ చేస్తూ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన టైం లో పరాశక్తిని వదలడం క్రేజీగా ఉంది. శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తో అతను కూడా కోలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరాడు.

కంటెంట్ మీద నమ్మకంతో..

నెక్స్ట్ వచ్చిన మదరాసి మాత్రం షాక్ ఇచ్చింది. మదరాసి హిట్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మరోపక్క పరాశక్తి సంక్రాంతి రిలీజ్ అంటే తెలుగులో కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్, రాజా సాబ్, రవితేజ సినిమా, శర్వానంద్ నారి నారి నడుమ మురారి వస్తున్నాయి. ఈ సినిమాలకు పోగా శివ కార్తికేయన్ కు పరాశక్తి కి థియేటర్లు ఎక్కువగా దొరుకుతాయన్న హోప్ లేదు. ఐతే పరాశక్తి కంటెంట్ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే పోటీ అయినా వెనక్కి తగ్గట్లేదని అంటున్నారు.

పరాశక్తి సినిమా నుంచి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ తోనే అంచనాలు పెరిగాయి. సుధ కొంగర డైరెక్టోరియల్ మూవీ అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. శివ కార్తికేయన్ ఈ సినిమాలో ఇంటెన్స్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.