రూ.20 కోట్ల ఓపెనింగ్స్.. సౌత్ లో నాని, విజయ్ హైయ్యెస్ట్!
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టైర్ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసిందే. టైర్-1, టైర్-2, టైర్-3 ఇప్పటికే అందరి హీరోలను డివైడ్ చేశారు సినీ ప్రియులు, అభిమానులు
By: M Prashanth | 8 Sept 2025 1:01 AM ISTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టైర్ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసిందే. టైర్-1, టైర్-2, టైర్-3 ఇప్పటికే అందరి హీరోలను డివైడ్ చేశారు సినీ ప్రియులు, అభిమానులు. అయితే టైర్ కాన్సెప్ట్ మాత్రం సోషల్ మీడియాలోనే పుట్టుకొచ్చిందని చెప్పాలి. నాని, విజయ్ తదితరులు టైర్-2 హీరోలుగా అంతా అభిప్రాయపడుతుంటారు.
అదే సమయంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే.. అనేక మంది టైర్-2 హీరోలు ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, ధనుష్, శివ కార్తికేయన్ తదితరులు ఉన్నారు. అయితే శివ కార్తికేయన్ రీసెంట్ గా మదరాసి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఏఆర్ మురుగుదాస్ ఆ మూవీ రూపొందించారు.
సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అదే సమయంలో తొలి రోజు మదరాసి మూవీ సాలిడ్ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.25.5 కోట్ల ఓపెనింగ్స్ (గ్రాస్) సాధించింది. అంతే కాదు శివకార్తికేయన్ కెరీర్ లో అత్యుత్తమ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతే కాదు రూ.20 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిన దక్షిణాది టైర్-2 హీరోల సినిమాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. విజయ్ దేవరకొండ లైగర్, ధనుష్ రాయన్, నాని సరిపోదా శనివారం, నాగచైతన్య తండేల్ సినిమాలను వెనక్కి నెట్టింది. అయితే ఆ లిస్ట్ లో ఏ సినిమా.. ఎంత ఓపెనింగ్స్ సాధించిందో ఓసారి తెలుసుకుందాం.
సౌత్ టైర్-2 హీరోల రూ. 20 కోట్ల+ ఓపెనింగ్ డే గ్రాసర్స్ (గమనిక - మల్టీస్టారర్లు చేర్చబడలేదు)
1) హిట్ 3- రూ.41 కోట్లు
2) దసరా - రూ.38 కోట్లు
3) అమరన్- రూ.36 కోట్లు
4) కింగ్ డమ్ - రూ.35 కోట్లు
5) కుబేర- రూ.30 కోట్లు
6) ఖుషి - రూ.27 కోట్లు
7) మదరాసి - రూ.25.5 కోట్లు
8) లైగర్ - రూ.25 కోట్లు
9) రాయన్ - రూ.24.2 కోట్లు
10) సరిపోదా శనివారం- రూ.22 కోట్లు
11) తండేల్- రూ.20.5CR
అయితే జాబితా ప్రకారం.. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖ హీరోలు నాని, విజయ్ దేవరకొండ ఒక్కొక్కరు మూడు సినిమాలతో టాప్ లో ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ధనుష్ ఒక్కొక్కరు రెండేసి సినిమాలతో రెండో ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు వీరంతా అనేక సినిమాల్లో నటిస్తున్నారు. వారితో పాటు పలువురు హీరోలు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి రూ.20 కోట్ల ఓపెనింగ్స్ గ్రాసర్స్ లిస్ట్ లో ఇంకెన్ని సినిమాలు చేరుతాయో చూడాలి.
