Begin typing your search above and press return to search.

రిషబ్ శెట్టితో సితార.. బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్..!

కాంతరా హీరో రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్ బ్లాస్టింగ్ అనౌన్స్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   30 July 2025 3:14 PM IST
రిషబ్ శెట్టితో సితార.. బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్..!
X

కాంతరా హీరో రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్ బ్లాస్టింగ్ అనౌన్స్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సితార బ్యానర్ లో రిషబ్ శెట్టి లీడ్ రోల్ సినిమా నేడు అనౌన్స్ చేశారు. 18వ శతాబ్దం భారత్ లో బెంగాల్ ప్రావిన్స్ లో ఒక తిరుగుబాటు దారుడు తలెత్తిన టైం అంటూ ఈ సినిమా గురించి హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేస్తున్నారు.

కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్..

కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఆ సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాంతార 2 రిలీజ్ అవ్వడమే ఆలస్యం సితార బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు డేట్స్ ఇస్తారని తెలుస్తుంది.

పీరియాడికల్ మూవీగా రాబోతున్న సితార, రిషబ్ శెట్టి మూవీ ఆ ప్రొడక్షన్ నుంచి వస్తున్న 36వ ప్రాజెజ్ట్ గా వస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైనట్టు తెలుస్తుంది. రిషబ్ శెట్టి ఇప్పటికే తెలుగులో జై హనుమాన్ సినిమాకు సైన్ చేశాడు. ఆ సినిమాకు కూడా తను డేట్స్ ఇవ్వనున్నాడు.

రిషబ్ శెట్టి కూడా తెలుగులో..

జై హనుమాన్ తో పాటుగా రిషబ్ శెట్టి సితార కాంబో సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. ఈ సినిమా ప్రీ లుక్ చూస్తేనే సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది. తప్పకుండా రిషబ్ శెట్టి ఖాతాలో ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రిషబ్ శెట్టి కూడా తెలుగులో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాడు.

కాంతార సినిమా కన్నడలో రిలీజై సూపర్ హిట్ అయ్యాక ఇది అన్ని భాషల్లో ఆడుతుందని గుర్తించి ఆ తర్వాత రిలీజ్ చేశారు. ఐతే కాంతార తోనే సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న రిషబ్ శెట్టి మరోసారి ఆ సినిమా ప్రీక్వెల్ తో సత్తా చాటాలని చూస్తున్నారు. ఆ మూవీతో పాటు తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్ లు సైన్ చేశాడు.

సితార బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఐతే రిషబ్ శెట్టి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా మారేలా ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరు.. మిగతా డీటైల్స్ త్వరలో వెల్లడిస్తారు.