పిక్‌టాక్ : సూపర్ స్టార్ ఫ్యామిలీ సూపర్ పిక్
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నమ్రత ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.
By: Ramesh Palla | 6 Sept 2025 4:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నమ్రత ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. సితార చిన్నతనంలోనూ తనకంటూ ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్‌ను మెయింటెన్ చేయడంతో పాటు, యూట్యూబ్ ద్వారా సితార పలు వీడియోలను సైతం అందించిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో ఇటీవలే చదువు మొదలు పెట్టిన గౌతమ్, మరో వైపు యాక్టింగ్, డాన్స్, ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఫిల్మ్ మేకింగ్ ట్రైనింగ్‌లో భాగంగా గౌతమ్ ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించాడు.
పిల్లలతో కలిసి నమ్రత శిరోద్కర్
ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ యూఎస్ ఓపెన్ చూసేందుకు గాను వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉన్నారు. మహేష్ బాబు ఈ ఫోటోల్లో లేడు, కానీ నమ్రత, గౌతమ్, సితారలు ఈ ఫోటోలో ఉన్నారు. ఆయన కూడా ఉండే ఉంటాడు, కానీ ఆయన రాజమౌళి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న కారణంగా లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డట్లు కొందరు అంటున్నారు. నమత్ర ఏ ఫోటోలో అయినా చాలా అందంగా కనిపిస్తారు. అంతే కాకుండా ఆమె తన ఫిజిక్‌ను అద్భుతంగా మెయింటెన్ చేస్తారు అనే టాక్ ఉంది. వయసు పెరుగుతున్నా కొద్ది నమ్రత రెగ్యులర్ హీరోయిన్స్ ని మించి అందంగా మారుతున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సితార, గౌతమ్ కృష్ణ కొత్త ఫోటో
ఇక మొన్నటి వరకు చిన్న పాపగా ఉన్న సితార రెండు మూడు ఏళ్లలో ఏకంగా తల్లిని మించిన కూతురు అయింది. ఎత్తులో మహేష్ బాబు పోలికతో నమ్రతను సైతం బీట్ చేసి సితార పెరిగిందని ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో సితార ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. అయినా కూడా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసినప్పుడు ఆమె గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆకట్టుకునే లుక్‌తో సితార క్యూట్‌గా ఉంది. సితార భవిష్యత్తులో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కు సితార అంటే చాలా ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సితారను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అనేది చూడాలి.
మహేష్ బాబు - రాజమౌళి మూవీ
యూఎస్ ఓపెన్ ను చూసేందుకు వెళ్లిన నమ్రత సింపుల్ యాష్ కలర్ ఔట్ ఫిట్ ధరించి, బ్లాక్ గాగుల్స్‌ను ధరించింది. ఇక సితార వైట్ షర్ట్, బ్లాక్ స్కర్ట్ ధరించింది. గౌతమ్ సైతం చాలా సింపుల్ టీ షర్ట్ ధరించి, జీన్స్ ధరించడం ద్వారా చాలా కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు స్క్రోల్ చేయలేక పోతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫోటోను తెగ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇప్పటి వరకు కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అయినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా నమ్మకంతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. బాహుబలి రికార్డ్‌లు బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.
