Begin typing your search above and press return to search.

వీడియో: ప్రిన్సెస్ ఆఫ్ టాలీవుడ్ స్ట‌న్నింగ్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేనికి తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   31 Jan 2026 10:02 AM IST
వీడియో: ప్రిన్సెస్ ఆఫ్ టాలీవుడ్ స్ట‌న్నింగ్ లుక్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేనికి తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో అంత‌ర్జాతీయ జువెల‌రీ బ్రాండ్ పీఎంజే కు సితార ప్ర‌మోష‌న్ చేస్తోంది. ఇక వేదిక‌పై సితార ఘ‌ట్ట‌మ‌నేని గ్లింప్స్ చూపరుల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. సితార వ‌య‌సు కేవ‌లం 13. ఇంత చిన్న వ‌య‌సులో అంత‌ర్జాతీయంగా వేవ్స్ క్రియేట్ చేస్తోంద‌నే చెప్పాలి.

మిరుమిట్లు గొలిపే డిజైన‌ర్ దుస్తుల్లో మ‌హేష్ గారాల ప‌ట్టీ సితార ఘ‌ట్ట‌మ‌నేని ఎంతో క్యూట్ గా, అందంగా క‌నిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్ర‌క‌ట‌న‌ వీడియోలో సితార అచ్చం ఒక ప్రొఫెషనల్ మోడల్ లాగా గొప్ప‌ ఆత్మవిశ్వాసంతో కనిపించ‌డం హైలైట్. అలా ఠీవిగా కెమెరా ముందు నిలుచున్న తీరు, క‌ళ్ల‌తోనే కోటి భావాలు ప‌లికిస్తూ, అందంగా స్మైలిస్తూ ఒక ప్రొఫెష‌నల్ మోడ‌ల్ నే త‌ల‌పించింది. భ‌విష్య‌త్ లో గొప్ప స్టార్ అయ్యే ల‌క్ష‌ణాలు సితార‌లో క‌నిపిస్తున్నాయ‌ని ఈ లుక్ చూడ‌గానే ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అందం, స్మైల్, ఎలివేష‌న్ ప‌రంగా త‌న తండ్రికి త‌గ్గ వార‌సురాలు అంటూ కితాబిచ్చేస్తున్నారు.

సితార‌కు ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ఉంది. ఇంత‌కుముందు న్యూయార్క్ లోని `టైమ్స్ స్క్వేర్` బిల్ బోర్డ్ పై మెరిసిన అతి పిన్న వయస్కురాలిగా సితార రికార్డు సృష్టించింది. ఇక సితార లుక్ చూడ‌గానే అచ్చం త‌న తండ్రిని త‌ల‌పిస్తోంద‌ని చాలా మంది అభిమానులు కితాబ‌చ్చేస్తున్నారు. ప్రిన్సెస్ ఆఫ్ టాలీవుడ్ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సితార చాలా చిన్న వ‌య‌సులో మోడ‌లింగ్ ద్వారా ఆర్జించిన 1 కోటి రూపాయ‌ల తొలి పారితోషికాన్ని త‌న తండ్రి చారిటీ కార్య‌క్ర‌మాల‌కు డొనేట్ చేసేయ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీనిని చిన్నారుల గుండె ఆప‌రేష‌న్ల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. మ‌హేష్ త‌ర‌హాలోనే సామాజిక సేవ‌లో తాను సైతం అంటూ సితార ముందుకు వ‌స్తోంది. త‌న జిజ్ఞాస అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నమ్రతా శిరోద్కర్ తన కుమార్తె కెరీర్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తూ త‌న ప్ర‌తిభ‌ను నెమ్మ‌దిగా ప్ర‌పంచానికి పరిచయం చేస్తున్నారు. సితార టాప్ మోడ‌ల్ గానే కాదు.. ఇండియా బెస్ట్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఛాన్సుంద‌ని ఇప్పుడు అభిమానులు ఊహాగానాలు సాగిస్తున్నారు. సితార ఘ‌ట్ట‌మ‌నేని ప్ర‌స్తుతం ఇంకా స్కూల్ కిడ్. క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి, భ‌ర‌త‌నాట్యంలోను శిక్షణ పొందుతోంది. ఇప్పటికే పలు వేదికలపై తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. న‌ట‌న‌లో అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను న‌మ్ర‌త స్వ‌యంగా ఇస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపిస్తే స‌రిపోదు! అందుకే మహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న వార‌ణాసి (#SSMB29) చిత్రంలో సితార ఏదైనా చిన్న పాత్ర చేస్తుందా? అనే ఆస‌క్తి అభిమానుల్లో ఉంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ప్ర‌పంచ‌స్థాయిలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో సితార ఘ‌ట్ట‌మ‌నేని క‌నిపిస్తే, క‌చ్ఛితంగా అది త‌న బ్రాండ్ ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తుంద‌ని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీనికి స‌మాధానం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నుంచి రావాల్సి ఉంది.