సితార ఘట్టమనేని అలెర్ట్.. జాగ్రత్త అంటూ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 19 Aug 2025 4:33 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె చేసే పోస్ట్‌లు, రీల్స్, డ్యాన్స్ వీడియోలు వెంటనే వైరల్ అవుతాయి.
ఇలాంటి సమయంలోనే సితార పేరు మీద నకిలీ అకౌంట్లు క్రియేట్ అవుతూ, అభిమానులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల సమస్య కొత్తది కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో కూడా ఎవరైనా అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుదోవ పట్టించే పరిస్థితులు తరచుగా కనిపిస్తుంటాయి.
తాజాగా సితార ఘట్టమనేని తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన పేరుతో అనేక ఫేక్, స్పామ్ అకౌంట్లు వస్తున్నాయని, వాటిపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించింది. సితార చేసిన పోస్ట్‌లో తాను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటానని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న తన అధికారిక అకౌంట్ ద్వారానే అభిమానులు, స్నేహితులు, వెల్ విషర్స్ కనెక్ట్ అవుతానని చెప్పింది.
ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఎక్కడా తాను లేనని తెలిపారు. అలాగే తన పేరుతో వస్తున్న ఇతర అకౌంట్లను ఫాలో అవ్వకూడదని, వాటితో ఎలాంటి ఇంటరాక్షన్ చేయకూడదని అభిమానులకు హెచ్చరిక ఇచ్చారు. ఈ పోస్ట్‌కు అభిమానులు భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వస్తున్నాయి.
అభిమానులు తప్పక జాగ్రత్తగా ఉంటాం, నువ్వు చెప్పినట్టే ఆఫీషియల్ అకౌంట్‌ను మాత్రమే ఫాలో అవుతాం అంటూ రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి సితార ఘట్టమనేని ఇచ్చిన అలర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్టార్ కిడ్స్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇలాంటి సమస్యలు ఎప్పటికప్పుడు రావడం సహజమే. కానీ సితార లాంటి వారు ముందుగానే క్లారిటీ ఇవ్వడం వలన అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం తగ్గిపోతుంది. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
