సితార గట్స్.. సౌండ్ లేదంతే..?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.
By: Ramesh Boddu | 17 Oct 2025 10:15 AM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. ఈ ఇయర్ మ్యాడ్ స్క్వేర్ తో సూపర్ హిట్ అందుకున్న సితార నాగ వంశీ డాకు మహరాజ్, కింగ్ డం సినిమాలు చేసినా ఆశించిన రేంజ్ రిజల్ట్ అందుకోలేదు. కింగ్ డం రిలీజ్ టైం బజ్ బాగున్నా ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ షాక్ ఇచ్చింది. అయినా సరే ఎక్కడ తగ్గకుండా తన బ్యానర్ లో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు సితార నాగ వంశీ.
కేవలం వారం గ్యాప్ లోనే
ఆల్రెడీ మాస్ మహరాజ్ రవితేజతో చేసిన మాస్ జాతర సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఇక నెక్స్ట్ సితార నుంచి రాబోతున్న 3 సినిమాలు కేవలం వారం గ్యాప్ లోనే వస్తున్నాయి. అదేంటి అంటే సినిమాల మీద తనకున్న కాన్ ఫిడెన్స్ ఎలాంటిదో సితార నాగ వంశీ చూపిస్తున్నారు. ఆయన చేస్తున్న ఫంకీ సినిమా డిసెంబర్ 25 క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది. అనుదీప్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విశ్వక్ సేన్ మాస్ ఇమేజ్ కి తోడుగా అనుదీప్ కామెడీ వర్క్ అవుట్ చేయాలని చూస్తున్నారు.
ఈమధ్యనే రిలీజైన ఫంకీ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక నెక్స్ట్ జననవరి 1న ఆల్కహాల్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు నాగ వంశీ. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఆల్కహాల్ సినిమాను మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంది. సినిమాలో సత్య కామెడీ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమా జనవరి 1న రిలీజ్ అంటే ఫంకీ వచ్చిన 6 రోజుల్లోనే తన సినిమా రిలీజ్ చేస్తున్నారు నాగ వంశీ.
నవీన్ పొలిశెట్టి, రవితేజ సినిమాలకు కలిసి వచ్చినట్టే..
ఇక సంక్రాంతికి అనగనగా ఒకరాజు సినిమా కూడా తీసుకొస్తున్నారు. పొంగల్ రేసులో ఆల్రెడీ చిరంజీవి సినిమా తో పాటు ప్రభాస్ రాజా సాబ్ వస్తుంది. రవితేజ అనార్కలి కూడా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అంటున్నారు. ఐతే రాజా సాబ్ సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందన్న టాక్ నడుస్తుంది. అది జరిగితే నవీన్ పొలిశెట్టి, రవితేజ సినిమాలకు కలిసి వచ్చినట్టే అవుతుంది.
సో డిసెంబర్ 25 క్రిస్మస్ న ఫంకీ, జనవరి 1న ఆల్కహాల్, సంక్రాంతికి అనగనగా ఒకరాజు అంటే మొత్తం 3 వారాల గ్యాప్ లో 3 సినిమాలు రిలీజ్ చేస్తూ సితార బ్యానర్ స్టామినా ఏంటో చూపించబోతున్నారు నాగ వంశీ. సెట్స్ మీద ఉన్న సినిమాల మీద తనకున్న నమ్మకంతో పాటుగా ఏ జోనర్ ని ఇష్టపడే ఆడియన్స్ ఆ జోనర్ సినిమాలు ఎప్పుడొచ్చినా చూస్తారన్న కాన్ ఫిడెన్స్ తోనే నాగ వంశీ ఇలా ఫిక్స్ అయ్యారని అనిపిస్తుంది. సో డిసెంబర్ ఎండింగ్ నుంచి సంక్రాంతి పూర్తయ్యే వరకు సితార బ్యానర్ సినిమాలే థియేటర్ లో సందడి షురూ చేస్తాయని చెప్పొచ్చు.
నాగ వంశీ ఈ దూకుడు చూసి ఆయన్ను టార్గెట్ చేస్తున్న కొందరికి సౌండ్ లేకుండా పోతుంది. ప్రతి నిర్మాత తన సినిమా గురించి కొన్ని క్రేజీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటాడు. ఈమధ్య నాగ వంశీ కూడా తమ బ్యానర్ సినిమాల గురించి గొప్పగా చెబుతూ వచ్చారు. ఐతే అవి ఆశించిన రేంజ్ రీచింగ్ లేకపోవడంతో ఆయన కూడా నెగిటివిటీ ఫేస్ చేస్తున్నారు. ఐతే దాన్ని పక్కన పెట్టి ఇలా 3 సినిమాలు 3 వారాల గ్యాప్ తో రావాలనుకోవడం నాగ వంశీ గట్స్ ఏంటో చూపిస్తుంది. మరి ఈ సినిమాల్లో ఏది నాగ వంశీకి సితార బ్యానర్ కి సూపర్ హిట్ అందిస్తుందో చూడాలి.
