రూట్ మార్చుకుంటున్న తెలుగమ్మాయిలు..
ముఖ్యంగా సిరి హనుమంతు విషయానికొస్తే. యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ అందుకుంది.
By: Madhu Reddy | 24 Jan 2026 5:00 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఎంతో కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. కానీ నటనలో టాలెంట్ ఉంటే.. అది నిరూపించుకోగలిగితే కచ్చితంగా తెలుగమ్మాయిలకు అవకాశం ఇస్తారు అని వైష్ణవి చైతన్య, శివాని నాగారం లాంటి హీరోయిన్స్ ఎంతోమంది నిరూపించారు. ముఖ్యంగా వీరు తెలుగమ్మాయిలే కానీ తమ నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు కూడా.
అయితే మరి కొంతమంది హీరోయిన్స్ తమ ఉనికిని చాటుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి, ఆ తర్వాత సినిమాల్లోకి వస్తున్నారు. మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు గానే కెరియర్ కొనసాగిస్తున్నారు.. అయితే ఇక్కడ మరి కొంతమంది మాత్రం ఏకంగా తండ్రి వయసుతో సమానంగా ఉన్న సెలబ్రిటీల పక్కన భార్యలుగా నటించి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. అలాంటి వారిలో సిరి హనుమంతు, సోనియా సింగ్.. ప్రథమ స్థానంలో నిలిచారు. నిజానికి వీరిద్దరూ కూడా సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్నారు.
ముఖ్యంగా సిరి హనుమంతు విషయానికొస్తే. యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాతే ఈమెకు ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఇటీవల శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించింది .ఈ పాత్ర ఈమెకు ఇమేజ్ అందించింది
కానీ 30 ఏళ్ల ఈ తెలుగమ్మాయి 66 ఏళ్ల నరేష్ భార్యగా నటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కథకు డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి పాత్ర చేసినా.. కానీ ఏకంగా తండ్రి వయసున్న వ్యక్తితో నటించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
దీనికి తోడు మరో యూట్యూబర్ , షార్ట్ ఫిలిం ఫేమ్ సోనియా సింగ్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన' భర్త మహాశయులకు విజ్ఞప్తి' లో ఏకంగా 55 సంవత్సరాల వయసున్న సునీల్ సరసన నటించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈమె వయసు 26 సంవత్సరాల కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ జంట సరదాగా సాగినా ఆడియన్స్ మాత్రం ఈ కాంబినేషన్ ను ఒప్పుకోవడం లేదు.
ఇకపోతే తెలుగమ్మాయిలకు హీరోయిన్గా అవకాశం ఇవ్వడం లేదు అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతోనే ఇమేజ్ దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి వీరి ఆలోచనల మేరకైనా భవిష్యత్తులో వీరికి మరిన్ని అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొంతమంది పాత్ర డిమాండ్ చేస్తే వయసుతో సంబంధం లేదు అందుకే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో తమ ఉనికిని చాటుకోవడానికి డిమాండ్ ఉన్న పాత్రలో నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి చూద్దాం తెలుగు అమ్మాయిల ఆలోచనలలో భారీ మార్పు వచ్చింది. ఇకనైనా వీరికి మంచి స్థానం లభిస్తుందేమో.
