గాయనితో క్రికెటర్ సిరాజ్ డేటింగ్‌లో నిజం?
టీమిండియా క్రికెటర్ సిరాజ్ ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో వన్‌మ్యాన్ షోతో అదరగొట్టేసిన సంగతిని ఎప్పటికీ మర్చిపోలేరు.
By: Sivaji Kontham | 10 Aug 2025 3:58 PM ISTటీమిండియా క్రికెటర్ సిరాజ్ ఇంగ్లండ్‌తో టెస్ట్‌లో వన్‌మ్యాన్ షోతో అదరగొట్టేసిన సంగతిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత అతడు స్టార్ అయ్యాడు. వన్డేలలో కీలక మ్యాచ్ లలో అదరగొట్టేయడమే కాదు, చాలా సార్లు టీమిండియా గెలుపులో భాగమయ్యాడు. అందుకే అతడికి దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే అంత పెద్ద క్రీడాకారుడు ఒక గాయని మనవరాలు, వర్థమాన గాయనితో ప్రేమలో ఉన్నాడన్న ప్రచారం ఇటీవల వేడెక్కించింది.
ప్రముఖ గాయని ఆశాభోంస్లే మనవరాలు అయిన జానియా భోంస్లేతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ పుకార్లు షికార్ చేసాయి. అయితే ఆ ఇద్దరూ తమపై ప్రచారాన్ని వెంటనే ఖండించారు. తమ మధ్య సోదరసోదరీమణుల సంబంధం మాత్రమే ఉందని ధృవీకరించారు.
ఈసారి రాఖీ పండగ రోజు ఆ ఇరువురి నడుమా ఎలాంటి బంధం ఉందో బయటపడింది. జానియా సోదర ప్రేమతో సిరాజ్‌కి రాఖీ కట్టారు. ఆ ఇద్దరి మధ్యా ఆప్యాయత, అనురాగాలు నిజమైన అన్నాచెల్లెళ్లకు తక్కువేమీ కాదని ఈ వీడియో స్పష్ఠం చేసింది. అంతేకాదు ఒక సోదరుడు రాఖీ కట్టిన తన చెల్లెలికి కానుక ఇవ్వడం సాంప్రదాయం. అలాంటి ఒక కానుకను కూడా జానియాకు అందించాడు సిరాజ్. అతడి ముఖంలో ఒక సోదరిపై ఉండే స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. ఇక రాఖీ కడుతున్నప్పుడు జానియా ముఖంలోను తన అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచింది. ఇది స్వచ్ఛమైన అన్నా చెల్లెళ్ల అనుబంధం అని ఈ వీడియో చూశాక ఎవరైనా అంగీకరిస్తారు.
జీవితం వేరు.. ఊహాగానాలు వేరు! నెటిజనులు ఏదైనా ప్రచారం చేసేప్పుడు ఊహాగానాలను విడిచిపెట్టి నిజానిజాలను తెలుసుకోవాలని ఈ ఘటన నిరూపించింది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కనిపిస్తే వెంటనే డేటింగ్ అంటూ పుకార్లు పుట్టించడం బాలీవుడ్ కల్చర్. కానీ అది అందరికీ వర్తించదని ప్రూవ్ చేసారు జానియా- సిరాజ్.
జానియా భోంస్లే పాపులర్ గాయని. సోషల్ మీడియాల్లో తన స్టేజ్ పెర్ఫామెన్సెస్ కి చెందిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెహమాన్ కాన్సెర్టులో జానియా పాడుతున్న ఒక వీడియో ఇన్ స్టాలో ఆకర్షిస్తోంది. జానియా కూడా నాయనమ్మ ఆశాభోంస్లే అంతటి పెద్ద గాయని కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు.. అందం చందంలో ఒక బాలీవుడ్ తారకు ఎంతమాత్రం తగ్గని జానియా నటిగాను రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. జానియా గాయని మాత్రమే కాదు.. మైమరిపింపజేసే మయూరంలా నర్తించే అద్భుత నర్తకి కూడా.
