Begin typing your search above and press return to search.

ఎవరీ ప్రభ.. మొన్న 'యేషనాగుల కట్ట'.. నేడు 'నారాయణమ్మ'.. మంగ్లీకి పోటీ ఇస్తోందా?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రంలో అనిరుధ్ రవిచందర్ సంగీతంలో ప్రభ పాడిన "యేష నాగుల కట్ట మీద" సాంగ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.

By:  Madhu Reddy   |   2 Oct 2026 4:00 AM IST
ఎవరీ ప్రభ.. మొన్న యేషనాగుల కట్ట.. నేడు నారాయణమ్మ.. మంగ్లీకి పోటీ ఇస్తోందా?
X

తెలుగు జానపద పాట అంటే మొన్నటి వరకు అందరికీ కేవలం 'మంగ్లీ' మాత్రమే టక్కున గుర్తొచ్చేది. కానీ, ఇప్పుడు ఆ ఫోకస్ పూర్తిగా 'సింగర్ ప్రభ' వైపు మళ్లింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభ పేరు మారుమోగిపోతోంది. ఆమెకు వరుసగా రెండు భారీ సినిమాలలో క్రేజీ ఆఫర్లు రావడమే దీనికి ప్రధాన కారణం. ఇన్నాళ్లు ఇండస్ట్రీని ఏలిన మంగ్లీని పక్కనపెట్టి మరీ మేకర్స్ ప్రభ వైపు మొగ్గు చూపడానికి అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఎవరీ సింగర్ ప్రభ?:

తెలుగు జానపద రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ ప్రభ, తన రా వాయిస్ బేస్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. 'రాను బొంబాయికి రాను', 'బండిల వోధు బావ' వంటి ఎన్నో సూపర్ హిట్ జానపద పాటలతో ఆమె యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆమె పాడిందంటే చాలు ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే.

'యేష నాగుల కట్ట మీద' సంచలనం:

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రంలో అనిరుధ్ రవిచందర్ సంగీతంలో ప్రభ పాడిన "యేష నాగుల కట్ట మీద" సాంగ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటకు ఆమెతో పాటు జంగిరెడ్డి గళం కలపగా, ఈ సాంగ్ రీల్స్‌లో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ ఒక్క పాటతో ప్రభ రేంజ్ పూర్తిగా మారిపోయింది.

లేటెస్ట్ సాంగ్ 'నారాయణమ్మ' క్రేజ్:

'యేష నాగుల కట్ట మీద' గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభ తాజాగా 'ఆదర్శ కుటుంబం' ఆల్బమ్ నుండి 'నారాయణమ్మ' అనే ప్రైవువెట్ ఫోక్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాట కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌‌లో దూసుకెళ్తోంది. ఆమె గాత్రంలోని పల్లెటూరి మాస్ వైబ్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తోంది.

మంగ్లీకి గట్టి పోటీ ఇస్తున్న ప్రభ:

తెలంగాణ జానపద పాటలకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిన సింగర్ మంగ్లీ కొద్దికాలంగా వివాదాలు మరియు లీగల్ సమస్యల కారణంగా సినిమాలకు, ఆల్బమ్స్‌కు కొద్దిగా దూరంగా ఉంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తుండటంతో మంగ్లీకి కొన్ని అవకాశాలు మిస్ అయ్యాయి అనే టాక్ వుంది. ఇదే సమయంలో ప్రభకు 'ది ప్యారడైజ్' లాంటి భారీ చిత్రంలో మంచి ఆఫర్ రావడంతో పాటు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రభకు ఉన్న హై-ఎనర్జీ ఫోక్ స్టైల్, రా వాయిస్ ఇండస్ట్రీలో ఆమెను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. మంగ్లీకి గట్టి ప్రత్యామ్నాయంగా మారుతున్న ప్రభ, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఫోక్ సింగర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె మరిన్ని అద్భుతమైన పాటలతో మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం.