Begin typing your search above and press return to search.

సింగీతం.. సెల్ఫ్ రికార్డును బ్రేక్ చేస్తారా?

అయితే వరల్డ్ వైడ్ గా చూస్తే ఆ రికార్డు ఇంకా మనోయెల్ డి ఒలివేరా పేరిటే ఉంది.

By:  M Prashanth   |   5 May 2026 6:00 AM IST
సింగీతం.. సెల్ఫ్ రికార్డును బ్రేక్ చేస్తారా?
X

టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాలే డామినేషన్ చెలాయించే కాలంలోనే వినూత్న ఆలోచనలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు మరొక అరుదైన ఘనతతో వార్తల్లో నిలిచారు. ఏకంగా 94 ఏళ్ల వయసులో సినిమా తెరకెక్కించి మరోసారి తన సత్తా చాటుకున్నారు.

సింగీతం అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలు. ప్రత్యేకంగా ఆదిత్య 369 ద్వారా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన తొలి దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే మాటలేమీ లేకుండా కథను చెప్పిన పుష్పక విమానం భారతీయ సినిమాకే ఒక మైలురాయిగా నిలిచింది.

దాదాపు ఆరు దశాబ్దాల సినీ జర్నీలో 60కి పైగా చిత్రాలు తెరకెక్కించిన సింగీతం, చివరిసారిగా వెల్‌ కమ్ ఒబామా మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు సింగ్ గీతం అనే కొత్త చిత్రంతో తిరిగి మెగాఫోన్ పట్టడం విశేషం. ఆ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ప్రముఖ బ్యానర్ వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

ఇక ఆ సినిమాతో సింగీతం ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ఇంత వయసులో సినిమా తెరకెక్కించిన భారతీయ దర్శకుడిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా జీవించి ఉన్న దర్శకుల్లో అత్యంత పెద్ద వయసులో ఫీచర్ ఫిల్మ్‌ కు దర్శకత్వం వహించిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. గతంలో ఆ ఘనత క్లింట్ ఈస్ట్‌ వుడ్ పేరిట ఉండేది. ఆయన 94 ఏళ్ల వయసులో సినిమా తెరకెక్కించగా, సింగీతం దాన్ని బ్రేక్ చేశారు.

అయితే వరల్డ్ వైడ్ గా చూస్తే ఆ రికార్డు ఇంకా మనోయెల్ డి ఒలివేరా పేరిటే ఉంది. ఆయన 103 ఏళ్ల వయసులో గెబ్ అండ్ ది షాడో అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును సింగీతం అధిగమించకపోయినా, ఇండియన్ మూవీ పరంగా ఇది గొప్ప మైల్ స్టోన్. ఇప్పటికే విడుదలైన సింగ్ గీతం టీజర్ చూస్తే, ఈ వయసులో కూడా సింగీతం ఎంత ఎనర్జీతో పనిచేస్తున్నారో అర్థమవుతోంది.

కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఆయన డెడికేషన్ కు నిదర్శనం. ముఖ్యంగా పాత తరానికి చెందిన దర్శకుడైనా, కథ మాత్రం నేటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కాంటెంపరరీగా ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ సినిమా విడుదల తర్వాత మరో ప్రాజెక్ట్‌ ను కూడా సింగీతం చేపడతారా? తీస్తే తన రికార్డును తాను మళ్లీ బ్రేక్ చేస్తారా? అన్నది హాట్ టాపిక్‌ గా మారింది.

వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన సింగీతం, మరోసారి సినిమా చేస్తే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, సింగీతం శ్రీనివాసరావు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తాజా రికార్డు, ఫ్యూచర్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలవడం ఖాయం. ఇక సింగీతం శ్రీనివాసరావు నుంచి మరో సర్‌ప్రైజ్ వస్తుందా? లేదా అన్నది చూడాలి.