సింగరేణి కార్మికుల జీవిత కథలతో జార్జిరెడ్డి!
టాలీవుడ్ లో బయోపిక్ లు తెరకెక్కడం చాలా అరుదు. జీవిత కథలకు పెద్దగా ఆదరణ ఉండదని అభిప్రాయమో? మరో కారణమో తెలియదు గానీ జీవిత కథల విషయంలో టాలీవుడ్ వెనుకబడి ఉందన్నది వాస్తవం.
By: Srikanth Kontham | 5 Oct 2025 4:56 PM ISTటాలీవుడ్ లో బయోపిక్ లు తెరకెక్కడం చాలా అరుదు. జీవిత కథలకు పెద్దగా ఆదరణ ఉండదని అభిప్రాయమో? మరో కారణమో తెలియదు గానీ జీవిత కథల విషయంలో టాలీవుడ్ వెనుకబడి ఉందన్నది వాస్తవం. తెలుగు దర్శకులు కూడా బయోపిక్స్ అంటే పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే తాజాగా సింగరేణి కార్మికుల జీవిత కథలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. `దళం`, `జార్జిరెడ్డి`,` చోర్` బజార్ లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు జీవన్ రెడ్డి. ఈ మూడు సినిమాలు కమర్శియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు గానీ ప్రతిభావంతుడని ప్రూవ్ చేసుకున్నాడు జీవన్ రెడ్డి.
కీలక పాత్రలో ఓ స్టార్ హీరో
`చోర్ బజార్` రిలీజ్ అయి మూడేళ్లు అయింది. అప్పటి నంచి ఇప్పటి వరకూ జీవన్ రెడ్డి నుంచి మరో సినిమా రాలేదు. తాజాగా బొగ్గు గనుల కార్మికుల జీవిత కష్టాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఒక వ్యక్తి కథలా కాకుండా సింగరేణి కార్మికుల జీవితాలు ఎలా ఉంటాయి? సమస్య తలెత్తిన సమయంలో వారి పోరాటం ఎలా ఉంటుంది? కుటుంబ అనుబంధాలు? ఆశలను స్పృశిస్తూ తె రకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో లీడ్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించనున్నాడు. ఓ కీలక పాత్రను ఓస్టార్ హీరో పోషిస్తున్నట్లు సమాచారం. పేరున్న హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారుట. ఆయన కూడా స్టోరీ విని పాజిటివ్ గా స్పందించినట్లు తెలిసింది.
బొగ్గు గనుల నేపథ్యంతో:
ఈ సినిమా కోసం ప్రత్యకంగా ఓ భారీ బొగ్గు గనుల సెట్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచేలా సినిమా ఉంటుందని చిత్రవ ర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కథ వీలైనంత వాస్తవికత ఉట్టి పడేలా ఉంటుందంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్:
బొగ్గు గనుల కథాంశం కావడంతో భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో పాన్ ఇండియాలో రిలీజ్ ఆలోచనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్కే కి జోడీ హీరోయిన్ సెట్ చేసే పనిలో నూ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్కే సాగర్ `ది 100` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అతడికి న మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. సినిమాలో సోషల్ కాజ్ కి ఓ సెక్షన్ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు.ఆ సినిమా గుర్తింపే మరో సినిమా అవకాశానికి దారి తీసింది. అన్నట్లు ఆర్కే సాగర్ కి మెగాస్టార్ చిరంజీవి తల్లి పెద్ద అభిమాని. ఆ సినిమా రిలీజ్ సమయంలో చిరంజీవి ఇంటికి పిలిపించి తల్లితో మాట మంతి ఏర్పాటు కూడా చేసిన సంగతి తెలిసిందే.
